ప్రపంచ స్కీ ఛాంపియన్‌షిప్ 2021: భారతీయ క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ విన్యాసాలు చూడండి

By Siva KodatiFirst Published Feb 21, 2021, 9:07 PM IST
Highlights

ప్రస్తుతం ఇటలీలోని కార్టినాలో జరుగుతున్న 2021 ప్రపంచ స్కీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా ఆల్పైన్ స్కైయర్ ఆంచల్ ఠాకూర్ చరిత్ర సృష్టించారు. మొత్తం 107 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆంచల్ 67వ స్థానంలో వుంది. 

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి చెందిన 24 ఏళ్ల స్కైయర్ ఆంచల్ భారతదేశ ఖ్యాతిని రెపరెపలాడించేందుకు ప్రయత్నిస్తున్నారు. శీతాకాలపు క్రీడల ప్రపంచంలో భారతదేశం బాల్య దశలో వుంది.

అయితే ఆంచల్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడం విశేషం. 2012లో ఇన్స్‌బ్రక్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న వారిలో ఆమె కూడా ఒకరు. తద్వారా ఈ క్రీడల్లో పాల్గొన్న ఏకైక భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. 

2012 యూత్ వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా స్లాలొమ్, జెయింట్ స్లాలొమ్ ఈవెంట్‌లలో కూడా ఆమె పాల్గొంది. టర్కీలో జరిగిన 2018 ఆల్పైన్ ఎజ్డర్ 3200 కప్‌లో ఆంచల్ కాంస్యం సాధించింది. ఈ తరహా క్రీడలల్లో ఆమె సాధించిన పతకం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిది. 

సుప్రసిద్ధ పారాగ్లైడర్ పైలట్ రోషన్ ఠాకూర్ కుమార్తె ఆంచల్. ప్రధాని నరేంద్ర మోడీ మనాలి పర్యటన సందర్భంగా రోషన్ ఠాకూర్ సహాయం చేశారు.

"

click me!