ఒంటి చేత్తో.. కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్

Published : Dec 14, 2018, 03:38 PM IST
ఒంటి చేత్తో.. కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్

సారాంశం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఒంటి చేత్తో.. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఒంటి చేత్తో.. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ పీటర్ హ్యాండ్స్ కాంబ్ బ్యాటింగ్ చేయగా.. బాల్ ని కోహ్లీ క్యాచ్ పట్టాడు. 

ఇషాంత్ వేసిన షార్టిష్ బాల్ ను స్లిప్స్ మీదుగా బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు పీటర్ హ్యాండ్స్ కాంబ్. కాగా.. అతి వేగంగా దూసుకువస్తున్న బంతి స్లిప్స్ మీది నుంచి వెళ్లిపోతుందని అందరూ భావించారు. కానీ.. కోహ్లీ గాలిలోకి ఎగిరి ఒంటి చేత్తో.. బాల్ ని క్యాచ్ పట్టాడు. ఆ తర్వాతి బంతికే అలాంటిదే మరో క్యాచ్ వచ్చినా.. అది అందనంత ఎత్తులో ఉండటంతో కోహ్లీ మిస్ అయ్యాడు.

కాగా.. ఇప్పుడు కోహ్లీ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ వీడియో.. నెట్టింట వైరల్ గా మారింది. కోహ్లీ క్యాచ్ పట్టిన తీరుని నెటిజన్లు ప్రశంసల వర్షంకురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?