వివాహ బంధంతో ఒక్కటైన సైనా,కశ్యప్

Published : Dec 14, 2018, 02:39 PM ISTUpdated : Dec 14, 2018, 03:05 PM IST
వివాహ బంధంతో ఒక్కటైన సైనా,కశ్యప్

సారాంశం

గచ్చిబౌలిలోని ఓరియాన్ విల్లాస్‌లో సైనా, కశ్యప్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యుల మధ్య.. అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. 

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు ఈ రోజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గచ్చిబౌలిలోని ఓరియాన్ విల్లాస్‌లో సైనా, కశ్యప్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యుల మధ్య.. అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. 

గవర్నర్ నరసింహన్‌ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. వివాహం అనంతరం  డిసెంబర్ 16వ తేదీన సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.  ఇప్పటికే వివాహ విందుకు కేటీఆర్‌, చిరంజీవి, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితర ప్రముఖులను ఈ జంట ఆహ్వానించింది.
 

PREV
click me!

Recommended Stories

Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?
Lionel Messi : మెస్సీతో సై అంటే సై.. సీఎం రేవంత్ రెడ్డి రచ్చ.. ఎవరు గెలిచారు?