నన్ను ఎలా జడ్జ్ చేస్తారు..? గంభీర్ కి కోహ్లీ కౌంటర్

By ramya NFirst Published Mar 23, 2019, 10:13 AM IST
Highlights

ఐపీఎల్ టైటిల్ గెలవడానికి ఏం చేయాలో తనకు బాగా తెలుసని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. 

ఐపీఎల్ టైటిల్ గెలవడానికి ఏం చేయాలో తనకు బాగా తెలుసని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ విషయంలో.. కోహ్లీ పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సెటైర్ వేశారు. కాగా.. గంభీర్ సెటైర్ కి కోహ్లీ తాజాగా కౌంటర్ ఇచ్చారు.


కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్‌ గురించి ఏమాత్రం అవగాహన లేని వారిలా మాట్లాడుతుంటారు అంటూ గంభీర్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. ఐపీఎల్ టైటిల్ తాను గెలవాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. అందుకోసం ఏం చేయాలో అవన్నీ తాను చేస్తున్నానని వివరించాడు. అయితే.. కేవలం ఐపీఎల్ టైటిల్ గెలిచానా లేదా అన్న విషయంపై నన్ను జడ్జ్ చేయడం ఏమాత్రం సరైందికాదని కోహ్లీ అన్నాడు.

‘‘నిజానికి ఒక క్రీడాకారుడి ప్రతిభను అంచనా వేయడానికి ఎటువంటి ప్రమాణాలు లేవు. నాకు సాధ్యమైనంత వరకు గెలవడానికే ప్రయత్నిస్తా. నా కెరీర్‌లో ఎన్ని టైటిల్లు గెలవాలని భావిస్తానో అన్నీ గెలిచి తీరతాను. అయితే కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రాన ఐపీఎల్‌లో కనీసం ఐదు మ్యాచుల వరకు నేను ఆడలేనని కొంతమంది ‘బయటి వ్యక్తులు’ భావిస్తున్నారు. వాళ్లలాగే ఇంట్లో కూర్చుంటాననుకుంటున్నారేమో’ అని కోహ్లి చురకలు అంటించాడు.

 ఐపీఎల్‌ టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవకపోయినా ఆర్సీబీ యాజమాన్యం... కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ గంభీర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కోహ్లీ పైవిధంగా స్పందించాడు. 

click me!