అనిల్ కుంబ్లేను స్వాగతిస్తూ చేసిన ట్వీట్ డిలిట్ చేసిన కోహ్లీ

Published : Jun 22, 2017, 09:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అనిల్ కుంబ్లేను స్వాగతిస్తూ చేసిన ట్వీట్ డిలిట్ చేసిన కోహ్లీ

సారాంశం

భారత క్రికెట్ టీమ్ లో  మాజీ కోచ్, కెప్టెన్ ల వివాదం కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీల మధ్య వివాదం అప్పట్లో అనిల్ కుంబ్లేను స్వాగతిస్తూ 2016లో పెట్టిన ట్వీట్ తాజాగా తొలగించిన కోహ్లీ  

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మధ్య వివాదం మరింత ముదురుతోంది. గతేడాది జూన్‌లో కుంబ్లేను కోచ్‌గా ఆహ్వానిస్తూ చేసిన ట్వీట్‌ను కోహ్లీ తాజాగా డిలీట్ చేశాడు. గతేడాది జూన్ 23న కోహ్లీ ట్వీట్ చేస్తూ జట్టుగా కోచ్‌గా వస్తున్న కుంబ్లేకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికాడు. కుంబ్లే సర్ అని అందులో పేర్కొన్నాడు. ఆయన ఆధ్వర్యంలో జట్టు ముందుకు సాగుతుందని, మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఇప్పుడా ట్వీట్‌ను కోహ్లీ డిలీట్ చేశాడు.

 

కాగా, బీసీసీఐతో కుంబ్లే కుదుర్చుకున్న ఒప్పందం చాంపియన్స్ ట్రోఫీతో ముగిసిపోయింది. తిరిగి రెండోసారి కూడా ఆయననే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు రాజుకోవడంతో కుంబ్లే అనూహ్యంగా కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కుంబ్లే నిర్ణయంతో కోహ్లీతో ఉన్న మనస్పర్థలు బయటపడ్డాయి.

PREV
click me!

Recommended Stories

గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..
Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?