టోక్యో ఒలంపిక్స్.. మ్యాచ్ కి ముందు చెంప పగలకొట్టిన కోచ్..!

Published : Jul 30, 2021, 12:06 PM ISTUpdated : Jul 30, 2021, 12:13 PM IST
టోక్యో ఒలంపిక్స్.. మ్యాచ్ కి ముందు చెంప పగలకొట్టిన కోచ్..!

సారాంశం

అలా కొట్టడాన్నిచాలా మంది తప్పు పడుతుండటం గమనార్హం. కానీ ట్రడోస్ మాత్రం తన కోచ్  చేసిన పనిని సమర్థించడం గమనార్హం.

టోక్యో ఒలంపిక్స్ జోరుగా సాగుతున్నాయి.  కాగా... ఈ మ్యాచ్ లో భాగంగా ఓ క్రీడాకారిణి పట్ల.. ఆమె కోచ్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. బరిలోకి దిగడానికి ముందు.. రెండు చెంపలు వాయకొట్టడం. పూర్తి వివరాల్లోకి వెళితే..

జర్మనీ క్రీడాకారిణి జుడోకా మార్టిన్ ట్రడోస్ కాసేపు ఆగింది. అప్పుడు ఆమెను ఉత్సాహపరచడం కోసం కోచ్ ఆమె యూనిఫామ్ ని పట్టుకొని గట్టిగా కుదిపేశాడు. అనంతరం.. రెండు చెంపలు గట్టిగా వాయకొట్టాడు. కాగా.. దీనికి సంబంధించిన  వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అలా కొట్టడాన్నిచాలా మంది తప్పు పడుతుండటం గమనార్హం. కానీ ట్రడోస్ మాత్రం తన కోచ్  చేసిన పనిని సమర్థించడం గమనార్హం.

‘‘నాలో కసి పుట్టించడానికి నా కోచ్ నేను కోరుకున్నదే చేశాడు. నేను మరో రకంగా వార్తల్లో నిలిస్తే బాగుండేది. ప్రతి పోటీకి ముందు కూడా నా కోరిక మేరకు నా కోచ్ ఇలానే చేస్తాడు’’ అని ఆమె చెప్పడం గమనార్హం. కాగా.. 63 కేజీ బౌట్లో ఆమె హంగేరికి చెందిన జోఫీ  ఒజ్బాస్ చేతిలో ఓడిపోవడం గమనార్హం.

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
T20 World Cup India Squad : ప్రత్యర్థులకు దడ.. ఇది టీమిండియా నయా అడ్డా