Tokyo Olympics: క్వార్టర్స్ లో ఆర్చర్ దీపికా కుమారి ఓటమి

By team teluguFirst Published Jul 30, 2021, 11:40 AM IST
Highlights

భారత ఆర్చర్ దీపికా కుమారి కొరియన్ ఆర్చర్ ఆన్ సాన్ తో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచులో 0-6 తో ఓటమి చెందింది.

భారత ఆర్చర్ దీపికా కుమారి కొరియన్ ఆర్చర్ ఆన్ సాన్ తో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచులో 0-6 తో ఓటమి చెందింది. ఒలింపిక్ టాప్ సీడ్ గా బరిలోకి దిగిన ఆన్ సాన్ మూడు వరుస సెట్లలో విజయం సాధించి 5 నిమిషాలలోపే వరల్డ్ నెంబర్ 1 పై విజయం సాధించింది. 

తొలి సెట్లో దీపికా  కుమారి తొలి షాట్ లో కేవలం 7 పాయింట్లను మాత్రమే సాధించింది. తరువాతి రెండు షాట్లలో పదేసి పాయింట్లను సాధించినప్పటికీ... కొరియన్ ప్లేయర్ మూడు టెన్స్ ని సాధించడంతో దీపికా తొలి సెట్ను కోల్పోయింది. 

ఇక రెండవ సెట్లో 10,7,7 పాయింట్లను మాత్రమే సాధించింది. ఆన్ సాన్ 9,10,7 పాయింట్లను సాధించి వరుసగా రెండవ సెట్ ని కూడా కైవసం చేసుకుంది. తొలి షాట్ లో దీపికా 10 పాయింట్లను సాధించినప్పటికీ... మొమెంటుమ్ ని కంటిన్యూ చేయలేకపోయింది. 

మూడవ సెట్లో దీపికా 7,8,9 ని సాధించగా... కొరియన్ 8,9,9 పాయింట్లతో మూడవ సెట్ ని కూడా కైవసం చేసుకొని సెమిస్ లోకి ప్రవేశించింది. మూడు సెట్లను కోల్పోవడంతో దీపికాకుమారి ఒలింపిక్ ప్రయాణం ముగిసింది. ఒలింపిక్స్ లో టాప్ సీడ్ గా బరిలోకి దిగిన ఆన్ సాన్ అందుకు తగ్గట్టుగా పెర్ఫామ్ చేసి 5 నిమిషాల్లో మ్యాచుని ముగించి మూడు సెట్లలో వరుస విజయాలతో సెమిస్ లోకి ప్రవేశించింది. 

రష్యన్ ఆర్చర్ పెరోవా తో జరిగిన మ్యాచులో 5 సెట్లలో దీపిక రెండు సెట్లను గెలవగా... పేరొవ రెండు సెట్లను గెలిచింది. మరొక సెట్ టై అవడంతో స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. 

ఆ తరువాత జరిగిన షూట్ అవుట్ లో రష్యన్ ఆర్చర్ పెరోవా 7 పాయింటర్ల షాట్ మాత్రమే కొట్టగా... దీపిక ఎక్సలెంట్ 10 పాయింటర్ తో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. టోక్యోలో నేటి ఉదయం చిరుజల్లులు కురుస్తుండడంతో వాతావరణం ఎలా ఉంటుందో అని అంతా భయపడ్డప్పటికీ... అంతా సజావుగా సాగింది. 

click me!