యూఎస్ ఓపెన్... ఓటమితో వెనుదిరిగిన రోజర్ ఫెదరర్

Published : Sep 04, 2019, 11:12 AM ISTUpdated : Sep 04, 2019, 12:34 PM IST
యూఎస్ ఓపెన్... ఓటమితో వెనుదిరిగిన రోజర్ ఫెదరర్

సారాంశం

తొలిసెట్ లో పై చేయి సాధించిన ఫెదరర్ రెండో సెట్ లో ప్రత్యర్థి దాటిని తట్టుకోలేకపోయాడు. తిరిగి పుంజుకొని మూడో సెట్ లో గెలిచినా.. నాలుగో సెట్ లో 4-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. నిర్ణయాత్మక పోరులో ఫెదరర్ ను గ్రిగర్ మట్టికరిపించాడు. 


యూఎస్ ఓపెన్ 2019 టైటిల్ సాధించాలన్న రోజర్ ఫెదరర్ ఆశలు నిరాశలుగా మిగిలిపోయాయి. క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో బల్గేరియన్ గ్రిగర్ డిమిట్రోప్ చేతిలో 6-3, 4-6, 6-3, 4-6, 2-6 తేడాతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

తొలిసెట్ లో పై చేయి సాధించిన ఫెదరర్ రెండో సెట్ లో ప్రత్యర్థి దాటిని తట్టుకోలేకపోయాడు. తిరిగి పుంజుకొని మూడో సెట్ లో గెలిచినా.. నాలుగో సెట్ లో 4-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. నిర్ణయాత్మక పోరులో ఫెదరర్ ను గ్రిగర్ మట్టికరిపించాడు. దీంతో 46వ గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్ ను ఫెదరర్ చేరుకోలేకపోయారు. కాగా.. శుక్రవారం జరగనున్న సెమీస్ లో రష్యా ఆటగాడు డేనియల్ తో గ్రిగర్ తలపడనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !