Tokyo Olympics:మహిళా హాకీ జట్టు మూడవ వరుస ఓటమి,4-1 తో బ్రిటన్ గెలుపు

By team teluguFirst Published Jul 28, 2021, 8:12 AM IST
Highlights

నేడు డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్ తో తలపడ్డ మ్యాచులో భారత మహిళా హాకీ జట్టు ఓటమి చెందింది. 

భారత మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో 1-4 తేడాతో ఓడింది. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవడంతోపాటుగా...  బలహీనమైన డిఫెన్సె వల్ల భారత్ ఈ మ్యాచ్ ను చేజేతులా కోల్పోయింది. 

భారత మహిళల హాకీ జట్టు తమ తొలి రెండు మ్యాచుల్లో నెదర్లాండ్స్,జర్మనీ చేతుల్లో ఓటమి చెందింది. గ్రూప్ స్టేజి నుంచి క్వాలిఫై అవ్వాలంటే భారత్ టాప్ 4 ఉంది తీరాలి. నేడు డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్ తో తలపడ్డ మ్యాచులో భారత మహిళా హాకీ జట్టు ఓటమి చెందింది. 

మ్యాచు ప్రారంభమైన 75 సెకండ్లలోపే బ్రిటన్ తన తొలి గోల్ ని సాధించింది. బాల్ ని అధికభాగం తమ కంట్రోల్ లో పెట్టుకున్న బ్రిటన్ భారత గోల్ పోస్టుపై వరుస దాడులు చేసింది. 

తొలి రౌండ్లో సాధించిన ఆధిక్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించిన బ్రిటన్ భారత గోల్ పోస్టుపై దాడి చేసి రెండవ క్వార్టర్లో తొలి 5 నిమిషాల లోపే మరో గోల్ ని సాధించింది. ఒకసారి ఆపిన గోలీ సవిత... రెండవ సారి మాత్రం ఆపలేకపోయింది. బ్రిటన్ రెండవ గోల్ సాధించి తమ ఆధిక్యాన్ని 2-0 కి పెంచుకుంది. ఆ వెంటనే భారత్ కూడా బ్రిటన్ గోల్ పోస్టుపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ... అది సాధ్యపడలేదు. 

ఆ తరువాత లభించిన పెనాల్టీ కార్నర్ ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకొని తొలి గోల్ సాధించింది. అద్భుతమైన డిఫ్లెక్షన్ అందించి షర్మిల దేవి భారత్ కి తొలి గోల్ అందించింది. గుర్జిత్ కౌర్ కొట్టిన ఫ్లిక్ ని సింగల్ హ్యాండెడ్ గా గోల్ లోకి డిఫ్లెక్టు చేసింది షర్మిల దేవి. 

తరువాత లభించిన పెనాల్టీ కార్నర్ ని సద్వినియోగం చేసుకోవడంలో విఫ్లమైంది. బాల్ ట్రాప్ విఫలమవడంతో అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది భారత్. అయినప్పటికీ... భారత్ తన ఎగ్రెసివ్ ఆటను కంటిన్యూ చేసింది. ఆఖరు నిమిషంలో కూడా గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ... అది కుదరలేదు. 

ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి... భారత్ 1-2 తో వెనుకంజలో ఉంది. ఆదిలో భారత డిఫెన్సె పూర్తిగా విఫలమవడం వలన బ్రిటన్ రెండు గోల్స్ సాధించగలిగింది. ఆ తరువాతి థర్డ్ క్వార్టర్లో భారత్ మరో మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలను చేజార్చుకుంది. అయినప్పటికీ... మూడవ క్వార్టర్ అంతా భారత్ బ్రిటన్ పై ప్రెజర్ ని అయితే పెట్టగలిగింది. కానీ చివరి నాలుగున్నర నిమిషాలప్పుడు లభించిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని 3-1 కి తమ లీడ్ ని పెంచుకుంది. 

ఇక ఆఖరు క్వార్టర్లో బ్రిటన్ ఆఖరు మూడున్నర నిముషాలు మిగిలి ఉండగా... బ్రిటన్ తనకి లభించిన పెనాల్టీ స్ట్రోక్ ని పూర్తి సద్వినియోగం చేసుకొని గోల్ సాధించి తమ ఆధిపత్యాన్ని 4-1 కి పెంచుకుంది. ఇక తదుపరి మ్యాచుల్లో ఐర్లాండ్,సౌత్ ఆఫ్రికా లపై భారత్ గెలవడంతోపాటుగా మంచి గోల్ డిఫరెన్స్ తో గెలవాలి..!

click me!