
టోక్యో ఒలంపిక్స్ లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్..ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తాను విజయం సాధించానని ఆమె ఎంతో ఆశపడ్డారు. కానీ.. జడ్జిల తీర్పు.. ప్రత్యర్థికి అనుకూలంగా రావడంతో.. తాను ఓటమిపాలయ్యానని ఆమెకు అర్థమైంది. ఓడిపోయిన తర్వాత ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. జడ్జిల తీర్పు సరిగా లేకపోవడం వల్లే తాను ఓడిపోయానని ఆమె పేర్కొన్నారు.
కాగా... తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీని ప్రశ్నించారు. సరిగా మ్యాచ్ కి ముందు అధికారులు తనను డ్రెస్ మార్చుకోమని సూచించారని.. అలా ఎందుకు చేశారని ఆమె ప్రశ్నించారు.
‘‘ ఆశ్చర్యం.. రింగ్ డ్రెస్ అంటే ఏమిటో కొంచెం వివరించగలరా..? నా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి ఒక నిమిషం ముందు.. నా రింగ్ డ్రెస్ మర్చుకోమని అడిగారు. అదేంటో నాకు చెప్పగలరా’’ అంటూ ఆమె ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ ని ప్రశ్నించారు.
ఈ ట్వీట్ లో ఆమె.. ప్రధాని కార్యాలయం, అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, అనురాగ్ ఠాకూర్ లను ట్యాగ్ చేశారు.
కాగా.. మేరీకోమ్ ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. చివరగా ఆమె 2012 లండ్ గేమ్స్ లో కాంస్య పతకం గెలిచారు. ఈ ఒలంపిక్స్ లో విజయం సాధించాలని ఆమె ఎంతగానో ఎదురు చూశారు. కానీ.. చివరకు ఓటమిపాలయ్యారు.