టోక్యో ఒలంపిక్స్.. తనకు ఇష్టమైన హెయిర్ కట్ ని త్యాగం చేసిన నీరజ్ చోప్రా

Published : Aug 10, 2021, 10:00 AM ISTUpdated : Aug 10, 2021, 10:03 AM IST
టోక్యో ఒలంపిక్స్.. తనకు ఇష్టమైన హెయిర్ కట్ ని త్యాగం చేసిన నీరజ్ చోప్రా

సారాంశం

ఆ ఫోటోల్లో నీరజ్ పొడవాటి జట్టుతో కనిపిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జట్టులేదు. ఈ ఒలంపిక్స్ కోసమే నీరజ్ తన జుట్టును త్యాగం చేయడం గమనార్హం.  

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కి స్వర్ణం కల నెరవేరింది. ఈ ఒలంపిక్స్ లో ఒక్కరైనా స్వర్ణం గెలవకపోతారా అని అందరూ ఆశగా ఎదురు చూశారు. కాగా.. అందరి బంగారు కలలను జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా.. నిజం చేశాడు. దాదాపు 121 సంవత్సరాల తర్వాత.. బంగారు పతకం రావడం గమనార్హం.

కాగా.. ఈ టోక్యో ఒలంపిక్స్ కోసం నీరజ్ చోప్రా.. తనకు ఎంతో ఇష్టమైన హెయిర్ కట్ ని వదిలేసుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వర్ణం గెలిచిన నాటి నుంచి నీరజ్ చోప్రా..కు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో నీరజ్ పొడవాటి జట్టుతో కనిపిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జట్టులేదు. ఈ ఒలంపిక్స్ కోసమే నీరజ్ తన జుట్టును త్యాగం చేయడం గమనార్హం.

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు, హర్యానాలోని పానిపట్‌లో నివసించే నీరజ్ చోప్రా జుట్టు కత్తిరించుకున్నాడు. నీరజ్ పొడవాటి జుట్టుతో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారు.. ఇశాంత్ శర్మ.. షారూఖ్ ఖాన్ ల నుంచి హెయిర్ స్టయిల్ తీసుకున్నావా అని కామెంట్స్ పెట్టారు. 

నీరజ్ కి తన ఆట ఎంత ఇష్టమో పొడవాటి జుట్టు అన్నా అంతే ఇష్టం. అందుకే ఎక్కువగా పొడవాటి జుట్టును పెంచుకునేవాడు. అయితే, ఒలింపిక్స్ సన్నాహాలలో భాగంగా తన జుట్టును కత్తిరించుకున్నాడు.  ''పొడవాటి జుట్టు కారణంగా గత కొన్ని పోటీలలోనేను సమస్యలను ఎదుర్కొన్నాను. జుట్టు చెమట పట్టేది. అది కళ్ల ముందు కూడా వచ్చేది. దీంతో జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. జావెలిన్ త్రోకు అది మరింత ఇబ్బంది అనిపించి జుట్టు కత్తిరించేసుకున్నాను.'' అని చెప్పడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Devdutt Padikkal : 4 మ్యాచుల్లో 3 సెంచరీలు.. గంభీర్, అగార్కర్‌లకు పెద్ద తలనొప్పి!
Sarfaraz Khan : 16 సిక్సర్లు, 14 ఫోర్లు, 217 రన్స్.. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో రోహిత్ రికార్డు బద్దలు !