ఒకే రోజు 12 పతకాలు కైవసం చేసుకున్న భారత్... అదరగొట్టిన భారత షూటర్లు.. మూడు పతకాలు సాధించిన భారత యంగ్ షూటర్ అషి చోక్సీ..
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్‌కి బుధవారం బాగా కలిసి వచ్చింది. ఒకే రోజు భారత్ 12 పతకాలు కైవసం చేసుకుంది. 18 ఏళ్ల యంగ్ షూటర్ ఇషా సింగ్, 25ఎం పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. సెయిలింగ్‌లో విష్ణు వర్థన్ కాంస్యం గెలిచింది.
భారత యంగ్ షూటర్ అషి చోక్సీ, ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో మూడు పతకాలు గెలిచింది. 10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్, 50మీ రైఫిల్ 3పీ టీమ్ ఈవెంట్‌లో రజత పతకాలు గెలిచిన అషి చోక్సీ.. 50మీ రైఫిల్ 3పీ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచింది..
undefined
భారత షూటర్ సిఫ్ట్ సమ్రా, 50మీ రైఫిల్ 3పీ షూటింగ్‌లో స్వర్ణం సాధించింది. 469.6 పాయింట్లతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది సిఫ్ట్.
What an incredible morning for India at the ! Heartiest congratulations to for winning the Gold medal and smashing a world record with a score of 469.6 in the Women's 50m Rifle 3P event. You've brought glory to our nation! 🌟 pic.twitter.com/w5heRlovHY
— Jay Shah (@JayShah)25మీ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను బకర్, ఇషా సింగ్, రైతమ్ సంగ్వాన్ 1759 పాయింట్లతో స్వర్ణం సాధించారు. 50మీ రైఫిల్ 3పీ టీమ్ ఈవెంట్‌లో సిఫ్ట్ సమ్రా, అషి చోక్సీ, మనిని కౌషిక్ కలిసి కాంస్యం గెలిచారు.
గుర్రపుస్వారీ (ఈక్వెస్ట్రెయిన్) ఈవెంట్‌లో భారత జట్టు మొట్టమొదటి స్వర్ణం సాధించింది. అనుష్ అగర్వాల్, హృదయ్ చెడా, సుదీప్తి హజేలా, దివ్యక్రితి సింగ్ మొదటి స్థానంలో నిలిచి, పసిడి సొంతం చేసుకున్నారు. 29ఏళ్ల భారత సెయిలర్ ఈబద్ ఆలీ, కాంస్యం గెలిచాడు.
భారత మహిళా హాకీ జట్టు, తొలి మ్యాచ్‌లో సింగపూర్‌పై 13-0 తేడాతో విజయం సాధించింది. స్కీట్ షూటింగ్ ఈవెంట్‌లో భారత షూటర్ ఆనంద్ జీత్ సింగ్ 58/60 పాయింట్లు సాధించి, రజతం గెలిచాడు. భారత పురుషుల బాస్కెట్ బాల్ టీమ్ గ్రూప్ స్టేజీలో వరుసగా రెండో విజయం అందుకుంది. మలేషియాపై గెలిచిన భారత బాస్కెట్ బాల్ టీమ్, మాకావుతో జరిగిన మ్యాచ్‌లో 21-12 తేడాతో విజయాన్ని అందుకుంది.
ఇప్పటిదాకా 5 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు, టాప్ 6లో కొనసాగుతోంది. ఇంకొక్క స్వర్ణం గెలిస్తే, భారత జట్టు టాప్ 4లోకి ఎగబాకుతుంది. భారత మహిళా క్రికెట్ టీమ్, ఫైనల్‌లో శ్రీలంక జట్టును ఓడించి స్వర్ణం సాదించింది. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత జట్టు స్వర్ణం సాధించింది.