ఆసియా పారా గేమ్స్‌ 2023 : జావెలిన్ త్రో లో‌ సుందర్ సింగ్ గుర్జార్‌కు స్వర్ణ పతకం.. వరల్డ్ రికార్డ్ కూడా

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో భారత్‌కు బుధవారం (అక్టోబర్ 25) ఫీల్డ్ డే ఉంది. పురుషుల జావెలిన్ T46 ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జార్ 68.60 మీటర్ల చివరి త్రోతో బంగారు పతకాన్ని ముద్దాడాడు.

Sundar Singh Gurjar creates world record, wins Javelin gold in Asian Para Games 2023 ksp

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో భారత్‌కు బుధవారం (అక్టోబర్ 25) ఫీల్డ్ డే ఉంది. పురుషుల జావెలిన్ T46 ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జార్ 68.60 మీటర్ల చివరి త్రోతో బంగారు పతకాన్ని ముద్దాడాడు. అంతేకాదు.. తన చివరి త్రో తో కొత్త ప్రపంచ రికార్డును సైతం సృష్టించాడు. రింకూ హుడా 67.08 మీటర్ల త్రో తో రజత పతకాన్ని గెలుచుకోగా.. అజీత్ సింగ్ యాదవ్ 63.52 మీటర్ల త్రో తో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే రెండుసార్లు పారాలింపిక్ బంగారు పతక విజేత దేవేంద్ర ఝఝరియా నాలుగో స్థానంలో నిలిచాడు. 

పురుషుల 400 మీటలర్ టీ13 విభాగంలో అవ్నిల్ కుమార్ మూడో స్థానంలో నిలవడంతో భారత్‌కు కాంస్యం దక్కింది. టీ13 అనేది దృష్టి లోపంతో వున్న ఆటగాళ్లను తెలుపుతుంది. గుర్జర్.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) సపోర్ట్‌తో 22 రోజుల పాటు ఫిన్‌లాండ్‌లో శిక్షణ పొందాడు. రింకూ కాంస్య పతకంతో పాటు వ్యక్తిగతంగా 60.92 మీటర్లను నమోదు చేయగా.. శ్రీలంక ఆటగాడు దినేష్ హెరాత్ 61.84 మీటర్ల త్రో తో ఆసియా రికార్డును బద్ధలు కొట్టాడు. 

Latest Videos

అయితే ఇంచియాన్‌లో జరిగిన చివరి ఆసియా పారా గేమ్స్‌లో రజతం సాధించిన ఝఝురియాకు మాత్రం ఈసారి నిరాశ తప్పలేదు. ఖేల్‌రత్న అవార్డు గ్రహీత, భారతదేశానికి చెందిన గొప్ప పారాలింపియన్‌గా నిలిచిన ఆయన అత్యుత్తమ త్రో గా 59.17 మీటర్లు సాధించాడు. మరోవైపు పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో అవ్నిల్ కుమార్ 52 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని కాంస్యం సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఇరాన్‌కు చెందిన ఒమిద్ జరీఫ్‌సనాయే స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇతను రేసును పూర్తి చేయడానికి 51.41 సెకన్ల సమయం తీసుకున్నాడు. 

కాగా.. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో భారత బృందం అంచనాలకు మించి రాణిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే  ఇండియా 35 పతకాలు సాధించి ఔరా అనిపిస్తోంది. ఆసియా పారా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో వుండగా.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. త్వరలోనే టాప్ 3కి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 
 

vuukle one pixel image
click me!