నీ కన్నా మా వాడే బెటర్: పాండ్యాపై హేడెన్ కవ్వింపులు

By Siva KodatiFirst Published Feb 20, 2019, 12:33 PM IST
Highlights

స్వదేశంలో వన్డే, టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో భారత్‌ ఆరంభం కానున్న సిరీస్‌కు ముందే ఆ జట్టు మాటల యుద్ధానికి దిగింది.

స్వదేశంలో వన్డే, టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో భారత్‌ ఆరంభం కానున్న సిరీస్‌కు ముందే ఆ జట్టు మాటల యుద్ధానికి దిగింది.

ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూహేడెన్ ముందుగా ఆ బాధ్యత తీసుకున్నట్లున్నాడు. పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు. స్వదేశమైనా, విదేశమైనా తనదైన రీతిలో రెచ్చిపోవడమే స్టోయినిస్‌కు తెలుసంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

స్టోయినిస్‌తో పోల్చుకుంటే పాండ్యా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, పరిస్థితులకు తగ్గట్టు, ఒత్తిడిలోనూ ఆడటం అలవాటు చేసుకోవాలని హేడెన్ వ్యాఖ్యానించాడు.

ఆసీస్ స్పీడ్ గన్ ప్యాట్ కమిన్స్‌తో ఇబ్బందులు టీమిండియాకు ఇబ్బందులు తప్పవని, ఓపెనర్ శిఖర్ ధావన్‌ అతనిని ఎదుర్కోలేడంటూ హేడెన్ హెచ్చరించాడు.

స్వింగ్‌, షార్ట్ పిచ్ బంతులను ఆడటంతో ధావన్ మరింత పరిణితిని సాధించాలని సూచించాడు. కాగా, భారత లెగ్ స్పిన్నర్ చాహల్‌ను మాత్రం హేడెన్ ఆకాశానికెత్తేశాడు.

ఇతడితో ఆసీస్‌కు ముప్పేనని, ముఖ్యంగా విధ్వసంక ఆటగాడు మ్యాక్స్‌వెల్‌.. చాహల్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడతాడని చెప్పాడు. వన్డేలు, టీ20లలో అనతికాలంలో చాహల్ వేగంగా వికెట్లు తీస్తున్నాడని, దీనిని బట్టి అతని ప్రతిభ అర్థం చేసుకోవచ్చిన హేడెన్ అభివర్ణించాడు.

ఈ నెల 24 నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఆరంభం కానుంది. ఈ టూర్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య రెండు టీ20, ఐదు వన్డేలు జరుగుతాయి. విశాఖ వేదికగా ఈ నెల 24న తొలి టీ20 జరగనుంది. 
 

click me!