టీ20ల్లో 99 వికెట్లు.. మలింగ సరికొత్త రికార్డ్

By telugu teamFirst Published Sep 2, 2019, 8:10 AM IST
Highlights

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా ఖ్యాతికెక్కాడు. మొత్తం 99 వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీయడం ద్వారా మలింగ 99 వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు. 

యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులను భయపెట్టే శ్రీలంక పేసర్‌ మలింగ.. మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2011లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన మలింగ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  ప్రస్తుతం టీ20లు మాత్రమే ఆడుతున్న మలింగ... సరికొత్త రికార్డును సృష్టించాడు.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా ఖ్యాతికెక్కాడు. మొత్తం 99 వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీయడం ద్వారా మలింగ 99 వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇంకొక్క వికెట్ తీస్తే... ముచ్చటగా.. 100 వికెట్లు తీసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. 

కాగా.. 35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా, కెన్యా, ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. వీటిలో రెండు హ్యాట్రిక్‌లను ప్రపంచకప్‌లోనే సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్‌లు చేసిన ఆటగాళ్లు మలింగ, వసీమ్‌ అక్రమ్‌ మాత్రమే. వన్డే మ్యాచుల్లో వండర్లు సృష్టించిన మలింగ.. వాటికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. మరి టీ20ల్లో ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తాడో చూడాలి.

click me!