IND vs SA: కోల్‌కతా టెస్టులో టీమిండియా ఘోర ఓటమి

Published : Nov 16, 2025, 04:04 PM IST
South Africa Stuns India in Thrilling Kolkata Test Victory

సారాంశం

India vs South Africa: మొదటి టెస్టులో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగుల టార్గెట్ ను అందుకోవడంలో విఫలమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించారు.

India vs South Africa: కోల్‌కతా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. ఈ విజయంతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఒకానొక సమయంలో, ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా చాలా వెనుకబడి ఉన్నట్టు అనిపించింది, కానీ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని, గెలుపు అంచున ఉన్న మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ముందు 124 పరుగుల లక్ష్యం ఉన్నా, మొత్తం జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో ఏ ప్లేయర్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. బ్యాటింగ్ చేయడానికి శుభ్‌మన్ గిల్ రాకపోవడంతో భారత్‌కు నష్టం జరిగింది.

124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత బ్యాటర్లు

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 10 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది, కానీ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆధిక్యం ఉండటంతో 124 పరుగుల లక్ష్యం లభించింది. ఈ చిన్న లక్ష్యాన్ని అందుకోవడంలో కూడా భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్రికా స్పిన్నర్ల వలలో టీమిండియా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు చిక్కుకుని 93 పరుగులకే ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ (31) అత్యధిక పరుగులు చేశాడు. అతని తర్వాత అక్షర్ పటేల్ (26), రవీంద్ర జడేజా, జురెల్ (13), రిషబ్ పంత్ (2), కేఎల్ రాహుల్ (1), కుల్దీప్ యాదవ్ (1) పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఖాతా తెరవలేదు.

కోల్‌కతాలో దక్షిణాఫ్రికా స్పిన్ వల

ఈ మ్యాచ్ గెలవాలంటే ఆఫ్రికా జట్టు భారత్‌ను 124 పరుగులలోపే కట్టడి చేయాల్సిన పరిస్థితిలో దాని బాధ్యతను వారి స్పిన్నర్లు చక్కగా నిర్వర్తించారు. హార్మర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు కేశవ్ మహారాజ్, మార్కో జాన్సెన్‌లకు కూడా 2-2 వికెట్లు దక్కాయి. ఒక వికెట్ ఐడెన్ మార్‌క్రమ్ ఖాతాలో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా ఆఫ్రికా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అంతకుముందు, భారత్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసింది.

మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బలహీన ప్రదర్శన

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లు ఆడి 159 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా బంతితో చెలరేగి 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ కూడా రెండేసి వికెట్లు తీయగా, ఒక వికెట్ అక్షర్ పటేల్ ఖాతాలో పడింది . దీంతో సఫారీ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. జట్టులో అత్యధికంగా (31) పరుగులు ఐడెన్ చేశాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం

ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 189 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, భారత్ ఆధిక్యం సాధించగలిగింది. బ్యాటింగ్‌లో రాహుల్ అత్యధికంగా 39 పరుగులు చేశాడు. అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ (29), రిషబ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27), అక్షర్ పటేల్, జురెల్ (14), యశస్వి జైస్వాల్ (12), శుభ్‌మన్ గిల్ (4), కుల్దీప్ యాదవ్ (1), మహమ్మద్ సిరాజ్ (1), బుమ్రా లు రాణించారు. ఆఫ్రికా బౌలింగ్ లో  హార్మర్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా 4 వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్, కార్బిన్ బాష్‌లకు 1-1 వికెట్ దక్కింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్మర్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !