కొంచెం బరువు తగ్గు.. జహీర్ ఖాన్ కి గంగూలీ రిక్వెస్ట్

By ramya neerukondaFirst Published Oct 8, 2018, 11:12 AM IST
Highlights

టీం ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ని కొంచెం బరువు తగ్గాలంటూ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ రిక్వెస్ట్ చేశారు.

టీం ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ని కొంచెం బరువు తగ్గాలంటూ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ రిక్వెస్ట్ చేశారు. ఆదివారం జహీర్ ఖాన్ తన 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. కాగా.. ఆయనకు క్రికెటర్లు, సినీ తారలు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా..ఈ నేపథ్యంలో సౌరవ్.. బరవుతగ్గాలంటూ ట్వీట్ చేయడం విశేషం.

‘హ్యాపీ బర్త్‌డే జహీర్‌.. నీకు ఈ ఏడాది మంచి జరగాలి. దయచేసి కొంచెం బరువు తగ్గవు.. నీవు భారత బలం’ అని చమత్కరిస్తూ విషెస్‌ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక జహీర్‌ గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో 36 టెస్టులు, 88 వన్డేలతో మొత్తం  124 మ్యాచ్‌లాడిన జహీర్‌ 232 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్‌ స్వింగ్‌ బౌలరైన జహీర్‌.. 2000లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో అదరగొట్టాడు.

స్వింగ్‌తో తన బౌలింగ్‌ వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ఈ టోర్నీలో  ఫైనల్‌కు చేరినప్పటికి న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైంది. మొత్తం కెరీర్‌లో  200 వన్డేలు, 92 టెస్టులు, 17 టీ20లాడిన జహీర్‌ వన్డేల్లో 282, టెస్టుల్లో 311, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో జహీర్‌ నాలుగోవాడు. అతని కన్నా ముందు అనిల్‌ కుంబ్లే, శ్రీనాథ్‌, అజిత్‌ అగార్కర్‌లున్నారు. ఇక జహీర్‌కు తన టీమ్‌మెట్స్‌ సెహ్వాగ్‌, లక్ష్మణ్‌, భజ్జీ, ఆర్పీసింగ్‌, కైఫ్‌లు సైతం విషెస్‌ తెలిపారు.

click me!