గే వివాదం.. విండీస్ క్రికెటర్ పై నిషేధం

By ramya NFirst Published Feb 14, 2019, 12:54 PM IST
Highlights

ఇంగ్లాండ్ టీం కెప్టెన్ జోరూట్ ను ‘గే’ గా పేర్కొంటూ.. వెస్టిండీస్ క్రికెటర్ షెనాన్ గాబ్రియెల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

ఇంగ్లాండ్ టీం కెప్టెన్ జోరూట్ ను ‘గే’ గా పేర్కొంటూ.. వెస్టిండీస్ క్రికెటర్ షెనాన్ గాబ్రియెల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆరోపణల ఎఫెక్ట్.. షెనాన్ ఆటపై పడింది. షెనాన్ పై నాలుగు వన్డే మ్యాచ్ ల నిషేధం విధిస్తూ.. ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెనాన్ గాబ్రియెల్ పై విచారణ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమైంది.

గాబ్రియెల్ పై నాలుగు వన్డేల నిషేధం పాటు మ్యాచ్ ఫీజులో 75శాతం కోత విధించింది. తాజా ఘటన తర్వాత గాబ్రియెల్ ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేరాయి. దాంతో అతని మొత్తం డీమెరిట్ పాయింట్ల సంఖ్య 8కి చేరింది. ఈ పాయింట్లు ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి లేక నాలుగు వన్డేల నిషేధానికి సమానం. ఈ క్రమంలోనే గాబ్రియెల్ పై నాలుగు వన్డేల నిషేధం విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది.

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మూడో టెస్టులో భాగంగా జో రూట్- షానన్‌ గాబ్రియల్‌ మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆట లో జో రూట్‌-జో డెన్లీలు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విండీస్‌ పేసర్‌ గాబ్రియల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గాబ్రియల్‌ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్‌ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దాంతో జో రూట్‌ను గేగా సంబోంధించడానే అభియోగాలపై ఐసీసీ విచారణ చేపట్టింది. 

click me!