గెలిచినప్పుడే కాదు.. ఓడినప్పుడూ తోడుగా ఉండాలి: పాకిస్తాన్ క్రికెటర్ వేడుకోలు.. (వీడియో)

By Mahesh KFirst Published Nov 6, 2022, 9:22 PM IST
Highlights

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఫైనల్స్‌కో.. సెమీ ఫైనల్స్‌కో చేరినప్పుడే కాదు.. పరాజయం పాలై కష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడూ టాప్ క్రికెటర్ల మద్దతు, ప్రోత్సాహం అవసరం ఉంటుందని పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రీది అన్నారు. ఈ రోజు బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీ ఫైనల్స్ బెర్త్‌ను పాకిస్తాన్ కన్ఫామ్ చేసుకుంది.
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఈ టీ20 వరల్డ్ కప్ 2022 నిజంగా అనూహ్య అనుభవంగా మిగిలిపోనుంది. ఇక టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఇంటికే అనే పరిస్థితుల దాకా జట్టు వెళ్లింది. అభిమానులు తీవ్ర నిరాశలోకి పోయింది. తొలి రెండు మ్యాచ్‌లు ఇండియా, జింబాబ్వేలపై ఓడిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు దాదాపు ఆశలు వదులుకున్నారు. కానీ, అనుకోకుండా అందివచ్చిన అవకాశం పాకిస్తాన్‌ను సెమీ ఫైనల్స్‌కు క్వాలిఫై చేసింది. నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్‌లను బీట్ చేయడంతో సెమీ ఫైనల్స్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రీది కీలక సందేశం ఇచ్చాడు. పాకిస్తాన్ మాజీ సీనియర్ ఆటగాళ్లు, అభిమానులకు సూచనలు చేశాడు. సంక్లిష్ట పరిస్థితుల్లో కటువుగా విమర్శించే వారికి ఆయన కొన్ని విజ్ఞప్తులు చేశాడు.

బంగ్లాదేశ్ పై గెలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘మేం అభిమానుల ప్రార్థనలతో సెమీ ఫైనల్స్ చేరుకున్నాం. మేం సెమీ ఫైనల్స్‌కో, ఫైనల్స్‌కో చేరినప్పుడే సపోర్ట్ చేయడం కాదు.. కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలి అని నాకు ఒక్కోసారి మనసులో అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా మేం పరాజయం పాలైనప్పుడే జట్టుకు మద్దతు, ప్రోత్సాహం అవసరం ఉంటుంది. మేం అభిమానుల ప్రార్థనలు, మద్దతుతోనే గెలిచాం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.

Shaheen Shah : Jo hamaray Top cricketers Hain unko chaia mushkil time mai Team ko support karay🤌 pic.twitter.com/aYuEznetZX

— Shizza~♪ (@shizzapizzaa)

తొలి రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్ ఓడిపోయినప్పుడు బాబర్ ఆజాం కెప్టెన్సీ, ప్రిపరేషన్, టీమ్ సెలెక్షన్ సహా పలు అంశాలను కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ టీమ్ పై విమర్శలు వచ్చాయి. మొహమ్మద్ ఆమిర్, వాహబ్ రియాజ్, ఇంజామాముల్ హక్, షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ వంటి వారు పాకిస్తాన్ టీమ్ పై వేలెత్తి చూపారు. 

Also Read: కొంత ఆట.. కావాల్సినంత అదృష్టం.. ఆశలే లేని పాకిస్తాన్ అవకాశాలతో సెమీస్ చేరిందిలా..!

బాబర్ ఆజాం టీమ్ ఫస్ట్ సెమీ ఫైనల్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉన్నది.

click me!