ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్‌లో ఘన విజయం అందుకున్న సానియా మీర్జా- రోహాన్ బోపన్న... ఫేర్‌వెల్ టోర్నీలో అదరగొట్టిన సానియా మీర్జా...
‘ది లాస్ట్ డ్యాన్స్’.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీకి సానియా మీర్జా పెట్టుకున్న పేరు ఇదే. ఇప్పటికే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా, భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహాన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలో దిగింది...
భారత జోడిపై పెద్దగా అంచనాలు లేకపోయినా అదిరిపోయే పర్ఫామెన్స్, దానికి కాస్త అదృష్ట కలిసి రావడంతో ఫైనల్‌కి దూసుకెళ్లింది సానియా - బోపన్న జోడి. క్వార్టర్ ఫైనల్‌లో వాకోవర్ దక్కడంతో నేరుగా సెమీస్ చేరింది సానియా -బోపన్న జోడి...
undefined
సెమీ ఫైనల్‌లో 3వ సీడెడ్ జోడి గ్రేట్ బ్రిటన్‌కి చెందిన నేల్ సికుప్సీ, యూఎస్‌కేకి చెందిన డిసైర్ క్రావసెక్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-6, 6-7, 10-6 తేడాతో హోరాహోరీగా పోరాడి విజయం సాధించింది భారత జోడి. ఈ విజయంతో ఫేర్‌వెల్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సానియా మీర్జా, టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచింది.
ఆస్ట్రేలియా జోడి ఓలివియా గడెస్కీ- మార్క్ పొల్మన్స్, బ్రెజిల్ జోడి లూక్రెజియా సెఫనిని- రాఫెల్ మాటోస్ మధ్య రెండో మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జోడితో శనివారం మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో తలబడుతుంది సానియా మీర్జా - రోహాన్ బోపన్న జోడి....
In a fitting farewell, 's last dance will take place on the grandest stage!
She and 🇮🇳 have qualified for the Mixed Doubles Final! • • • • • pic.twitter.com/qHGNOvWMoC
2009లో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సానియా మీర్జా,2016లో వుమెన్స్ డబుల్స్‌లో టైటిల్ సొంతం చేసుకుంది. 2009 తర్వాత 2012, 2015, 2016 సీజన్లలో మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీ ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయిన సానియా మీర్జా, గత ఎడిషన్‌లో క్వార్టర్ ఫైనల్ నుంచి తప్పుకుంది...
2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన సానియా మీర్జా, ఆ తర్వాత సీజన్‌లో టైటిల్ గెలిచింది. 2009 తర్వాత 14 ఏళ్లకు తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్ చేరిన సానియా మీర్జా, తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌ని విజయంతో ముగించాలని గట్టి పట్టుదలతో ఉంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ 2012, యూఎస్ ఓపెన్ 2014, వుమెన్స్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016, వింబుల్డన్ 2015, యూఎస్ ఓపెన్ 2015 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన సానియా మీర్జా, ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం టైటిల్ గెలవలేకపోయింది..