ఏషియన్ గేమ్స్: సైనా నెహ్వాల్ ఓటమి...కాంస్యంతో సరి

By Arun Kumar PFirst Published Aug 27, 2018, 11:25 AM IST
Highlights

ఆసియా క్రీడల్లో హైదరబాదీ స్టార్ షట్లర్ సైనా అనుకున్న రీతిలో రాణించలేకపోయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సైనా బ్యాడ్మింటన్ సెమి ఫైనల్లో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. 

ఆసియా క్రీడల్లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమిపాలయ్యింది. స్వర్ణమే లక్ష్యంగా ఇండోనేషియాలో అడుగుపెట్టిన ఈ టాప్ ఇండియన్ ప్లేయర్ కేవలం కాంస్యంతో వెనుదిరగాల్సి వచ్చింది. 

ఇవాళ జరిగిన  బ్యాడ్మింటన్  మహిళల సింగిల్స్ సెమిఫైనల్లో హైదరాబాదీ షట్లర్ సైనా ఘోర పరాజయ్యాన్ని చవిచూసింది. చైనా క్రీడాకారిణి తైజ్ ఇంగ్ చేతిలో 2-0 తేడాతో సైనా ఓడిపోయింది. దీంతో ఈ ఈవెంట్ నుండి వైదొలగిన సైనా కేవలం కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.   

హోరాహోరీగా జరుగుతుందనుకున్న మ్యాచ్ లో సైనా భారత అభిమానులను నిరుత్సాహ పర్చింది. మొదటి రౌండ్ ను 17-21 తో కోల్పోయిన సైనా సెకండ్ రౌండ్ లో కూడా అదే ఆటతీరును కనబర్చింది. దీంతో 14-21 తేడాతో సెకండ్ రౌండ్ ను కూడా కోల్పోయి 2-0 తేడాతో పరాజయం పాలయ్యింది. ఈ మ్యాచ్ లో వరల్డ్ నెంబర్ వన్ తైజు ఇంగ్ చక్కటి ఆటతీరుతో, సైనా కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయాన్ని కైవసం చేసుకుంది. 

ఈ కాంస్యంతో భారత పతకాల సంఖ్య 37 కు చేరింది.ఇందులో  7 స్వర్ణాలు, 10 సిల్వర్, 20 కాంస్య పతకాలున్నాయి. 

click me!