ఆ యువ క్రికెటర్‌తో నేను పోటీ పడట్లేదు...: వృద్దిమాన్ సాహా

By Arun Kumar PFirst Published Feb 20, 2019, 3:29 PM IST
Highlights

భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆటతీరుతో రాణిస్తున్న యువ ఆటగాళ్ళతో కూడిన టీంఇండియా రిజర్వ్ బెంచ్ కూడా అత్యంత పటిష్టంగా వుంది. ఈ సమయంలో ఏవైనా కారణాలతో సీనియర్లు జట్టుకు దూరమైతే యువ ఆటగాళ్లు వారి లోటును భర్తీ చేయడమే కాదు...ఏకంగా ఆ స్థానాన్నే ఆక్రమిస్తున్నారు. ఇలా తాజాగా సీనియర్ వికెట్ కీఫర్ వృద్దిమాన్ సాహా స్థానాన్ని యువ  వికెట్ కీఫర్ రిషబ్ పంత్ ఆక్రమించుకున్నాడు. 

గాయం కారణంగా సాహా భారత జట్టునుండి హటాత్తుగా వైదొలిగాల్సి వచ్చింది. ఇదే సమయంలో పంత్ కి టీంఇండియా తరపున ఆడే అవకాశం రావడం...దాన్ని అతడు సద్వినియోగా చేసుకోవడం జరిగింది. దీంతో మళ్లీ భారత జట్టులో స్థానం సాహాకు అవకాశాలు సన్నగిల్లాయి.  

ఈ విషయంపై సాహా  మాట్లాడుతూ... రిషబ్ పంత్ తో తనకు పోటీ లేదని పేర్కొన్నాడు. అతడు బాగా ఆడుతున్నాడు కాబట్టి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నేను జట్టుకు దూరమవడం వల్లే పంత్ కు అవకాశం వచ్చిన మాట నిజమే. అయితే అందివచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడని సాహా అన్నాడు. 

రిషబ్ పంత్ తో కలిసి తాను ఎన్‌సీఏ లో కలిసి శిక్షణ తీసుకున్నట్లు సాహా  తెలిపాడు. ఆ సమయంలో ఇద్దరం మంచి స్నేహంగా వుండేవారిమని...అయితే క్రికెట్ కు సంబంధించిన విషయాలపై ఎక్కువగా మాట్లాడుకునేది కాదన్నాడు. భారత జట్టులో ఎంపిక, ఆటతీరు గురించి తామిద్దరం మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువని సాహా వెల్లడించాడు.

ఇంగ్లాండ్ లో మోచేతి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం చాలా కాలం విశ్రాంతి తీసుకున్నానని సాహా అన్నాడు. ఇటీవలే గాయం పూర్తిగా తగ్గడంతో సయ్యద్ మస్తాన్ అలీ టీ20 ట్రోపీ కోసం సిద్దమవుతున్నట్లు తెలిపాడు. బెంగాల్ జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శనతో మళ్లీ ఫామ్ అందుకోడానికి ప్రయత్నిస్తానని సాహా పేర్కొన్నాడు. 

click me!