SAFF Championship: ఫైనల్ మ్యాచ్‌లో ఉత్కంఠ.. కువైట్‌ను ఓడించి 9వ సారి ఛాంపియన్‌గా నిలిచిన  భారత్ ..

By Rajesh Karampoori  |  First Published Jul 4, 2023, 10:58 PM IST

SAFF Championship: ఫైనల్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు కువైట్‌ను ఓడించింది. ఈ విజయంతో తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 5-4తో కువైట్‌పై విజయం సాధించింది


SAFF Championship: సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు మరో ట్రోఫీని కైవసం చేసుకుంది.  సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ లో భారత్ కువైట్‌ను ఓడించింది. మంగళవారం బెంగళూరులోని కఠీరవం స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో సునీల్ ఛెత్రీ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 5-4తో కువైట్‌ను ఓడించింది.

వాస్తవానికి నిర్ణీత సమయానికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి, ఆ తర్వాత మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. కానీ అదనపు సమయంలో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు గోల్‌ చేయలేకపోయారు. ఆ తర్వాత మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. అయితే సాఫ్ ఛాంపియన్‌షిప్‌ను భారత్ 9వ సారి గెలుచుకుంది. ఎట్టకేలకు డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొమ్మిదో సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 

Latest Videos

undefined

ఈ మ్యాచ్‌లో కువైట్ ఆటగాడు అల్కాల్డి తొలి గోల్ చేశాడు. ఈ విధంగా మ్యాచ్ 16వ నిమిషంలో కువైట్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అదే సమయంలో దీని తర్వాత భారత జట్టుకు 17వ నిమిషంలో గోల్ చేసే అవకాశం వచ్చింది, కానీ మిస్ అయింది. అయితే భారత్ తరఫున కెప్టెన్ సునీల్ ఛెత్రి 39వ నిమిషంలో గోల్ చేశాడు. దీంతో భారత జట్టు సమం చేసింది. ఆ తర్వాత గేమ్ 1-1తో సమమైంది.

భారత్-కువైట్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో టైగా ఉంది. ఆ తర్వాత మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అయితే అదనపు సమయంలో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ చేయడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత మ్యాచ్‌ని పెనాల్టీ షూటౌట్‌ ద్వారా నిర్ణయించారు. పెనాల్టీ షూటౌట్‌లో భారత జట్టు 5-4తో కువైట్‌ను ఓడించింది. ఈ విధంగా, సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని భారత జట్టు రికార్డు స్థాయిలో 9వ సారి SAFF ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.

click me!