వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ.. చూస్తే కళ్లు తిప్పుకోలేం..

By SumaBala Bukka  |  First Published Nov 2, 2023, 6:40 AM IST

ముంబైలోని వాంఖడే స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ విగ్రహావిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. సచిన్ సిక్సర్ కొడుతున్న భంగిమలో విగ్రహం ఆకట్టుకుంటోంది. 


న్యూఢిల్లీ : ప్రపంచకప్‌లో భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ కు ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా,  భారీ అభిమానుల కోలాహలం మధ్య ఆవిష్కరించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సచిన్, అతని కుటుంబ సభ్యుల సమక్షంలో అద్భుతమైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి సంజయ్ బన్సోడే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే, కార్యదర్శి అజింక్యా నాయక్, పలువురు బీసీసీఐ, ఎంసీఏ అధికారులు పాల్గొన్నారు. 

Latest Videos

undefined

సఫారీల ఊచకోత .. న్యూజిలాండ్ ఘోర పరాజయం, అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా

దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సొగసైన బ్యాటింగ్ ను కళ్లముందు ఉంచేలా... ఈ విగ్రహాన్ని రూపొందించారు.ఈ విగ్రహాన్ని స్టేడియంలో సచిన్ టెండూల్కర్ పేరుతో ఉన్న స్టాండ్‌కు పక్కనే ఏర్పాటు చేశారు. ఈ యేడు ఏప్రిల్‌లో సచిన్ 50వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇదో గొప్ప బహుమతిగా చెప్పవచ్చు. పురస్కరించుకుని సచిన్ 50 సంవత్సరాల జీవితానికి గుర్తుగా ఉంటుంది ఈ విగ్రహం. రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన చిత్రకారుడు-శిల్పి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

టెండూల్కర్ బౌలర్ త మీదుగా లాప్టెడ్ షాట్ ఆడుతున్నట్లుగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సచిన్ వేలాది యాక్షన్ చిత్రాలను పరిశీలించిన తర్వాత ఈ భంగిమ తీసుకున్నట్లు తెలిపారు. సచిన్ ఎడమ కాలు ముందుకు చాపి, శరీరాన్ని కొద్దిగా వంచి, తల ఎత్తి, బ్యాట్ ను ఆకాశం వైపు చూపిస్తూ, లాఫ్టెడ్ డ్రైవ్ భంగిమలో చిరస్మరణీయమైన సిక్సర్ షాట్‌తో ఈ విగ్రహం రూపొందింది. దీనికి క్రికెట్ దిగ్గజం వ్యక్తిగత ఆమోదం లభించింది. 

నవంబర్ 2013లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తరపున తన చివరి ఆట ఆడిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత టెండూల్కర్ విగ్రహాన్ని అతని స్వస్థలమైన వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేశారు. 2014లో భారతరత్న అవార్డు పొందిన టెండూల్కర్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో పాటు వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. 

click me!