శ్రీశాంత్ అలా... ద్రవిడ్ ని కూడా తిట్టాడు... పాడీ ఆప్టన్

Published : May 04, 2019, 08:02 AM IST
శ్రీశాంత్ అలా... ద్రవిడ్ ని కూడా తిట్టాడు... పాడీ ఆప్టన్

సారాంశం

మాజీ టీం ఇండియా క్రికెటర్ శ్రీశాంత్ ప్రవర్తన సరిగా ఉండేది కాదని... టీమిండియా మెంటల్‌ కండీషనింగ్‌ మాజీ కోచ్‌ పాడీ ఆప్టన్‌ అన్నారు. 

మాజీ టీం ఇండియా క్రికెటర్ శ్రీశాంత్ ప్రవర్తన సరిగా ఉండేది కాదని... టీమిండియా మెంటల్‌ కండీషనింగ్‌ మాజీ కోచ్‌ పాడీ ఆప్టన్‌ అన్నారు. ఇటీవల ఆప్టన్ ‘బేర్‌ఫుట్‌ కోచ్‌’ అనే పుస్తకం రాశారు. అందులో పలు ఆసక్తికర విషయాలను ఆప్టన్ వెల్లడించారు.

2013 ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ కుంభకోణంలో శ్రీశాంత్‌ అరెస్ట్‌ కావడానికి 24 గంటల ముందు ఈ సంఘటన జరిగినట్టు తెలిపాడు. ‘శ్రీశాంత్‌ ప్రవర్తన సరిగా ఉండేది కాదు. జట్టునుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించడానికి అతడి ప్రవర్తన కూడా కారణం. ముంబైతో మ్యాచ్‌కు అతడిని తప్పిస్తున్నట్టు శ్రీశాంత్‌కు చెప్పాం. దాంతో అతడు ద్రావిడ్‌ను, నన్ను అందరిముందే నిందించాడు’ అని ఆప్టన్‌ పేర్కొన్నాడు. కాగా ఈ విషయంలో ఆప్టన్‌ అబద్ధాలు చెబుతున్నాడని శ్రీశాంత్‌ అన్నాడు.

PREV
click me!

Recommended Stories

T20 World Cup : బౌలర్లను ఉతికారేసిన బ్యాటర్లు.. ఆ మ్యాచ్‌లు చూస్తే పూనకాలే !
T20 World Cup 2026 : పాకిస్థాన్ తప్పుకుంటే మళ్లీ బంగ్లాదేశ్ ఎంట్రీ? వరల్డ్ కప్‌లో సంచలన ట్విస్ట్ !