Rohit sharma: రోహిత్ అరుదైన రికార్డ్‌.. ఆ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా

Published : May 30, 2025, 09:51 PM ISTUpdated : May 30, 2025, 10:45 PM IST
Rohit Sharma

సారాంశం

స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మ‌రో మైలు రాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.

 

ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మార్క్‌ను అధిగమించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.

ఈ మ్యాచ్ ప్రారంభంలో రోహిత్ శర్మకు అదృష్టం సహకరించింది. ప్రసిధ్ కృష్ణ వేసిన ఓవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ను గెరాల్డ్ కోయిట్జీ వదిలేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సునాయస క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. ఇలా రెండు లైఫ్‌ల‌ను పొందిన రోహిత్.. ఆ తర్వాత ఫామ్‌లోకి వ‌చ్చాడు. కేవలం 28 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు.

 

 

ఐపీఎల్ 9వ ఓవర్‌లో రషీద్ ఖాన్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచిన రోహిత్... ఐపీఎల్‌లో 7వేల పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫీట్‌తో పాటు అతను 300 సిక్సర్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు.

ఐపీఎల్ టాప్ రన్ స్కోరర్స్ (2025 వరకు):

విరాట్ కోహ్లీ – 8618 పరుగులు

రోహిత్ శర్మ – 7000+ పరుగులు

శిఖర్ ధావన్ – 6769 పరుగులు

డేవిడ్ వార్నర్ – 6565 పరుగులు

సురేశ్ రైనా – 5528 పరుగులు

ఎంఎస్ ధోనీ – 5439 పరుగులు

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు:

క్రిస్ గేల్ – 357

ఎంఎస్ ధోనీ – 364

రోహిత్ శర్మ – 300+

విరాట్ కోహ్లీ – 291

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Cricketers : కోహ్లీ, ధోనిని దాటేసిన హార్దిక్.. అత్యంత ఖరీదైన వాచ్ ఎవరిదో తెలుసా?
IND vs NZ : ఆ గ్రౌండ్‌లో రోహిత్, కోహ్లీలకు శని పట్టిందా? 17 ఏళ్లుగా తీరని కోరిక !