‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

Published : Jan 05, 2019, 04:36 PM IST
‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

సారాంశం

టీం ఇండియా యువ సంచలనం రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. 

టీం ఇండియా యువ సంచలనం రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. రిషబ్ పంత్ లో అపారమైన నైపుణ్యం ఉందని.. అది ఆసీస్ తో అతను ఆడిన నాల్గో టెస్టులో సాధించిన సెంచరీనే ఉదాహరణ అని రికీ పాంటింగ్ కొనియాడారు.

భారత క్రికెట్ లో ఇప్పటి వరకు అందరూ ధోని గురించి మాత్రమే మాట్లాడుకున్నారని.. ఇక నుంచి పంత్ గురించి కూడా మాట్లాడుకుంటురన్నారు. ధోనీ ఎక్కువ కాలం టెస్టు క్రికెట్ ఆడినా.. ఈ ఫార్మాట్ లో కేవలం ఆరు సెంచరీలు మాత్రమే సాధించాడని.. అదే సమయంలో ఎన్నో ఘనతలు ధోనీ తన సొంతం చేసుకున్నాడన్నారు.

కానీ పంత్ మాత్రం కచ్చితంగా ధోనిని దాటేస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే సామర్థ్యం పంత్ లో ఉందని చెప్పారు. అతనిలో చాలా గొప్ప ప్రతిభ ఉందన్నారు. అతను బ్యాటింగ్ చేసే విధానం చూడముచ్చటగా ఉంటుదన్నారు. ప్రస్తుతం 21వ పడిలో ఉన్న పంత్.. సుదీర్ఘకాలం భారత్ కి  సేవలు అందిస్తాడన్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !
Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్