
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అరుదైన రికార్డులు సాధించారు. ఈ మ్యాచులో కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చివరకు ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో 97 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు.
అయితే తన టెస్ట్ కెరీర్‌లో కోహ్లీ 90కి పైగా పరుగులు చేసిన తర్వాత సెంచరీ చేయకుండా కోహ్లీ ఔట్ కావడం ఇది రెండోసారి. 2013లో వాండరర్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ 96 పరుగులు చేసి సెంచరీ చేయకుండా అవుటయ్యాడు. అయితే ఈ రెండు ఔట్‌ల మధ్యలో కోహ్లీ 17 సెంచరీలు చేశాడు.
మరోవైపు రిషబ్ పంత్ తన టెస్ట్ కెరీర్‌ని సిక్సర్‌తో ప్రారంభించాడు. దీంతో సిక్సర్ తో టెస్ట్ కెరీర్ ను ప్రారంభించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. శనివారం టెస్ట్‌ల్లో ఆరంగేట్రం చేసిన పంత్, కోహ్లీ వికెట్ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చాడు.
రషీద్ వేసిన 78వ ఓవర్‌లో రెండో బంతికే పంత్ సిక్స్ కొట్టి టెస్టుల్లో తన ఖాతాని తెరిచాడు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 12వ క్రికెటర్‌గా పంత్ నిలిచాడు.
ఈ మ్యాచులో మరికొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఐదేళ్ల (2013) తర్వాత ఆసియా, విండీస్‌లో కాకుండా భారత్ తరఫున తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం (60) నమోదయ్యాయి. టెస్టుల్లో రహానె 3వేల పరుగుల (81 ఇన్నింగ్స్) మైలురాయిని దాటాడు.
ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో 90ల్లో అవుటైన మూడో భారత ఆటగాడు కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. గతంలో గంగూలీ (99), సచిన్ (92, 91) అలా అవుటయ్యారు.
భారత్‌పై టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్ ఆండర్సన్ రికార్డు నమోదు చేశాడు. మురళీధరన్ (105) టాప్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌లో తొలి రోజు ఆటలో భారత్‌కిది మూడో అత్యధిక స్కోరు (307/6) కావడం విశేషం.