ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు... మహిళా షూటింగ్ విభాగంలో మొదటి స్వర్ణం

By Arun Kumar PFirst Published Aug 22, 2018, 3:16 PM IST
Highlights

ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారులు విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు స్వర్ణపతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ మరో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అయితే ఈ గోల్డ్ సాధారణమైనది కాదు. ఆసియా క్రీడల్లో ఓ భారతీయ మహిళా షూటర్ గోల్డ్ సాధించిడం ఇదే మొదటిసారి. దీంతో ఈ విజయం భారత మహిళాలోకం ప్రతిభను తార్కానంగా నిలిచింది.

ఇవాళ జరిగిన 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో రహీ సర్నోబత్ అత్యుత్తమ ఆటతీరుతో స్వర్ణం సాధించింది. మొత్తంగా నాలుగు రోజుల ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం. ఆసియా గేమ్స్‌ చరిత్రలోనే భారత్ తరపున గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారత మహిళగా రహీ చరిత్ర సృష్టించింది. 

click me!