Pro Kabaddi League 2023: ప్రో కబడ్డీ లీగ్.. రసవత్తరపోరు..12 జట్ల కెప్టెన్లు వీరే..

By Mahesh Rajamoni  |  First Published Dec 2, 2023, 5:31 PM IST

Pro Kabaddi League: కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2023-24 ప‌దో సీజ‌న్ లో మొత్తం 12 జ‌ట్లు పాలుపంచుకుంటున్నాయి. ఈ సిరీస్ లో బెంగాల్ వారియ‌ర్స్, బెంగ‌ళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ  కేసీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యూ ముంబా, యూపీ యోధాస్ జ‌ట్టు పాల్గొంటాయి.
 


Pro Kabaddi League 2023: 2014లో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌ ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. శ‌నివారం నుంచి ప్రొ క‌బ‌డ్డీ లీడ్ 10 సీజ‌న్ ప్రారంభం కానుంది. మొద‌టి మ్యాచ్ గుజ‌రాత్ జెయింట్స్ - తెలుగు టైటాన్స్ మ‌ధ్య అహ్మదాబాద్ లోని ట్రాన్స్‌స్టాడియా స్టేడియంలోని ఎరీనాలో జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో లీగ్‌ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జర‌గ‌నున్నాయి. 

నెలన్నర పాటు జరిగే ప్రపంచ కప్ తో బిజీగా ఉన్న క్రీడాభిమానులకు శనివారం నుంచి దేశీ క్రీడ క‌బ‌డ్డీ విన్యాసాలు, స్ఫూర్తిదాయ‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆస్వాదించే అవకాశం లభించనుంది.  ప్రొ కబడ్డీ లీగ్ పదో ఎడిషన్ అహ్మదాబాద్ లో నేడు ప్రారంభం కానుంది. వచ్చే మూడు నెలల్లో జరగనున్న ఈ లీగ్ ఎంతో ఉత్కంఠను రేకెత్తించ‌డంతో పాటు క‌బ‌డ్డీ ప్రియుల‌కు మంచి వినోదాన్ని అందించ‌నుంది. ఈ లీగ్ లో మొత్తం 12 జ‌ట్లు పాలుపంచుకుంటున్నాయి.

Latest Videos

undefined

కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2023-24 ప‌దో సీజ‌న్ లో మొత్తం 12 జ‌ట్లు పాలుపంచుకుంటున్నాయి. ఈ సిరీస్ లో బెంగాల్ వారియ‌ర్స్, బెంగ‌ళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ  కేసీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యూ ముంబా, యూపీ యోధాస్ జ‌ట్టు పాల్గొంటాయి.

కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2023-24 సీజ‌న్ లో వివిధ జ‌ట్ల కెప్టెన్ల వివ‌రాలు: 

  1. బెంగాల్ వారియ‌ర్స్ - మణిందర్ సింగ్
  2. బెంగ‌ళూరు బుల్స్ - సౌరభ్ నందల్
  3. దబాంగ్ ఢిల్లీ  కేసీ - నవీన్ కుమార్
  4. గుజరాత్ జెయింట్స్ - ఫజెల్ అత్రాచలి
  5. హర్యానా స్టీలర్స్ - మోహిత్ నందల్ & జైదీప్ దహియా
  6. జైపూర్ పింక్ పాంథర్స్ - సునీల్ కుమార్
  7. పాట్నా పైరేట్స్ - నీరజ్ కుమార్
  8. పుణెరి పల్టన్ - అస్లాం ఇనామ్ దార్
  9. తమిళ్ తలైవాస్ - సాగర్ రాథీ  
  10. తెలుగు టైటాన్స్ - పవన్ సెహ్రావత్
  11. యూ ముంబా - సురీందర్ సింగ్
  12. యూపీ యోధాస్ - పర్దీప్ నర్వాల్
click me!