ప్రో కబడ్డి 2019: పోరాడిఓడిన పాట్నా పైరేట్స్... ఉత్కంఠపోరులో ముంబైదే విజయం

Published : Oct 02, 2019, 08:56 PM IST
ప్రో కబడ్డి 2019: పోరాడిఓడిన పాట్నా పైరేట్స్... ఉత్కంఠపోరులో ముంబైదే విజయం

సారాంశం

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో యూ ముంబా మరో అద్భత విజయాన్ని అందుకుంది. పాట్నా పైరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పాయింట్ల తేడాతో ముంబై గెలిచింది.  


ప్రో కబడ్డి లీగ్ 2019 లో యూ ముంబా మరో విజయాన్ని అందుకుంది. గతరెండు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్న  పాట్నా ఫైరేట్స్ ఈ మ్యాచ్ లో మాత్రం ఓటమిని చవిచూసింది. యూ ముంబాతో చివరివరకు పోరాడి కేవలం 4 పాయింట్ల తేడాతో పైరేట్స్ జట్టు   ఓడిపోయింది.

ముంబై-పాట్నాల మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ కు పంచకులలోని తాయి దేవీలాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికయ్యింది. ఇందులో విజేతగా నిలిచిన యూ ముంబా  రైడింగ్ లో 17, ట్యాకిల్స్ లో 7, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 4 మొత్తంగా 30 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో అభిషేక్ 7, అతుల్ 5, రోహిత్ 5, ఫజల్ 4  పాయింట్లతో రాణించి ముంబై విజయంలో కీలకంగా వ్యవహరించారు. 

పాట్నా విషయానికి వస్తే రైండింగ్ లో 15, ట్యాకిల్స్ లో 7, ఎక్స్‌ట్రాల రూపంలో 4 మొత్తం 26 పాయింట్లు సాధించింది. ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలవగా మహ్మద్ ఇస్మాయిల్ 5, హది 4, లీ జంగ్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అయినప్పటికి ముంబై కంటే  4 పాయింట్లు వెనకబడి పాట్నా పైరేట్స్  ఓటమిపాలయ్యింది.
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు