బెంగళూరు కాదు కోల్‌కతా... డిసెంబర్ 2019లో ఐపిఎల్ వేలం

By Arun Kumar PFirst Published Oct 2, 2019, 8:28 PM IST
Highlights

ఐపిఎల్ ఆటగాళ్ల వేలంపాట వేదిక మారిపోయింది. ప్రతిఏడాది ఈ కార్యక్రమం బెంగళూరులో జరుగుతుండగా ఈసారి కోల్‌కతాలో జరగనుంది.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్... భారతీయ క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెల్లిన అద్భుత టోర్నీ. ముఖ్యంగా యువ క్రికెటర్లు  తమ ప్రతిభను బయటపెట్టడానికి ఇదో మంచి వేదికయ్యింది. ఇలా యువ క్రికెటర్లు కొందరు ప్రస్తుతం సీనియర్లతో సమానంగా పేరునే కాదు డబ్బులు సంపాదిస్తున్నారంటే అందుకు కారణం ఈ ఐపిఎలే. అయితే ఈ ఐపిఎల్ ఆడాలంటే మాత్రం ఆటగాళ్లు ఫ్రాంఛైజీల దృష్టిలో పడాల్సిందే. యాజమాన్యాలను ఆకట్టుకుంటే ఎలాంటి అనుభవంలేని ఆటగాళ్లు సైతం వేలంపాటలో భారీ ధరను పలకడం ఖాయం. 

ఇలా ఆటగాళ్ళకున్న క్రేజ్, డిమాండ్ గురించి తెలుసుకోవాలని చాలామంది అభిమానులకు కూతూహలంగా వుంటుంది. వాటిగురించి తెలుసుకోవాలంటే ఐపిఎల్ వేలంపాటను చూడాల్సిందే. ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు అవసరాలను దృష్టిలో వుంచుకుని యాజమాన్యాలు ఆటగాళ్లను వేలంపాట ద్వారా  దక్కించుకుంటాయి. ఇలా క్రికెట్లో కంటే ఐపిఎల్ వేలంపాటలో భారీ ధర పలికి ఫేమస్ అయిన క్రికెటర్లు చాలామంది వున్నారు. 

ప్రతిఏడాది మాదిరిగానే 2020 ఐపిఎల్ సీజన్ కోసం ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ లో మరోసారి ఐపిఎల్ వేలంపాట జరగనుంది. అయితే ప్రతిసారిలా ఈ కార్యక్రమం బెంగళూరులో కాకుండా ఈసారి కోల్‌కతాలో జరగనుంది. ఈ మేరకు ఐపిఎల్ నిర్వహకుల నుండి అధికారిక ప్రకటన వెలువడింది.  డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలంపాట జరగనుంది. 

ఐపిఎల్ లో ప్రతి ప్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.85  కోట్లు ఖర్చు చేసుకోవచ్చు. అలా ఓ ఏడాది వేలంపాటలో మొత్తం డబ్బును ఉపయోగించుకోలేని జట్లు  తదుపరి ఏడాది ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. అలా గతేడాది జరిగిన వేలంపాటలో అత్యధికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ.8.2 కోట్లు, రాజస్థాన్‌ వద్ద రూ.7.15 కోట్లు, నైట్‌రైడర్స్‌ వద్ద రూ. 6.05 కోట్లు మిగిలిపోయాయి. వీటిని ఈ వేలంపాటలో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి డిల్లీ, రాజస్థాన్, కెకెఆర్ జట్లలో ఐపిఎల్్ 2020లో కొత్తఆటగాళ్లు చేరే అవకాశముంది. 

 

click me!