భార‌త్ లో ఒలింపిక్స్.. టీమిండియా అథ్లెట్లతో ప్ర‌ధాని మోడీ ! దేశం గ‌ర్వించేలా చేయాలి..

By Mahesh Rajamoni  |  First Published Jul 6, 2024, 9:02 AM IST

Paris Olympic 2024 : పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. టోర్నీలో పతకాలు సాధించేలా ప్రోత్సహించారు. గెలుపు ఓటముల ఒత్తిడికి తావులేకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని సూచించారు.
 


Paris Olympic 2024 : ప్ర‌పంచ క్రీడా స‌మ‌రానికి స‌ర్వం సిద్ధమైంది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చారిత్రాత్మక స్వర్ణంతో సహా మొత్తం 7 పతకాలు సాధించడం భారతదేశ అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి భారత్ నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ స్టార్ అథ్లెట్ల నుంచి యావ‌త్ భార‌తావ‌ని మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆటగాళ్లతో వర్చువల్‌గా మాట్లాడారు. గెలుపు ఓటముల ఒత్తిడికి తావులేకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని సూచించారు. దేశం గ‌ర్వించే క్ష‌ణాల‌ను అందిస్తార‌ని ఆశించారు.

పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే ఆటగాళ్లతో ప్రధాని మోడీ ఇంకా మాట్లాడుతూ..  "స్పోర్ట్స్ ప్రపంచంలో ఉన్న‌  దేశంలోని ఆట‌గాళ్ల‌ను కలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. కొత్త విషయాలను తెలుసుకుంటూ, వారి ప్రయత్నాలను అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఒక ప్రభుత్వంగా, నేను వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలనుకుంటే, నేను పని చేస్తూనే ఉండాలి. అందరితో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. ఒలంపిక్స్ గ్లామర్ దృష్టిని మళ్లిస్తుంది కాబట్టి గ్లామర్‌లో పడిపోకూడదు.. ఇతర ఆటగాళ్లను చూసి కలవరపడకూడదు. ఇది ప్రతిభతో కూడిన ఆట. మీ ప్రత్యర్థి ఎత్తు గురించి చింతించకుండా మీ ప్రతిభపై దృష్టి పెట్టండి.. అది మీకు ఫలితాలను ఇస్తుంది. దేశం గ‌ర్వించే క్ష‌ణాలు అందిస్తార‌ని అనుకుంటున్నాను" అని అన్నారు.

Latest Videos

undefined

గెలిచినా, ఓడిపోయినా బాధపడొద్దన్న ప్ర‌ధాని మోడీ.. "పతకాలు రావచ్చు, రాకపోవచ్చు. దాని నుండి ఒత్తిడి తీసుకోకండి, కానీ మీ ఉత్తమ ప్ర‌ద‌ర్శ‌న‌ ఇవ్వండి. పారిస్‌లో ఉన్న పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి భారత ఆటగాళ్లు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉంది" అని అన్నారు. దేశం కీర్తిప్ర‌తిష్ట‌లు మ‌రింత పెంచుతార‌ని ఆశిస్తూ.. ఒలింపిక్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆటగాళ్లను స్వాగతించడానికి వేచి ఉంటానని అన్నారు. 'ఆగస్టు 11న ఒలింపిక్స్ ముగిసిన తర్వాత మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ కోసం మళ్లీ వేచి ఉంటాను. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో దేశం మిమ్మల్ని చూసి గ‌ర్విస్తుంది. ఎందుకంటే గెలుపు ఓటములు వేరు, కానీ ఒలింపిక్స్‌కు వెళ్లడం పెద్ద విషయం అని ప్ర‌ధాని మోడీ అన్నారు. 2036 ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుందన్న నమ్మకం ఉందనీ, దీంతో పారిస్ విశ్వక్రీడలకు వెళ్లే అథ్లెట్లను ఫ్రాన్స్ రాజధానిలో ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని మోడీ అన్నారు.

6, 6, 6... రాహుల్ ద్రవిడ్ బ్యాట్ పవర్ కు ఇంగ్లాండ్ బౌలర్‌కు దిమ్మదిరిగిపోయింది.. !

click me!