టీ20ల్లో పాక్ సంచలన రికార్డ్

By ramya neerukondaFirst Published Nov 3, 2018, 12:14 PM IST
Highlights

వరసగా 11 టీ20 సిరీస్ లు గెలుచుకున్న జట్టుగా టీం పాకిస్థాన్ నిలిచింది. శుక్రరవారం పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ తో తలపడగా.. 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టీ 20 క్రికెట్ మ్యాచుల్లో పాకిస్థాన్ జట్టు సంచలన రికార్డు సాధించింది. వరసగా 11 టీ20 సిరీస్ లు గెలుచుకున్న జట్టుగా టీం పాకిస్థాన్ నిలిచింది. శుక్రరవారం పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ తో తలపడగా.. 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

దీంతో.. వరసగా 11 టీ 20 సిరీస్ లు గెలుచుకుంది. దీనికి ముందు ఆస్ట్రేలియితో తలపడిన పాక్ జట్టు ఆ సరీస్ ని కూడా తన ఖాతాలోనే వేసుకుంది. తాజాగా న్యూజిలాండ్ తో మూడు టీ20 సిరీస్ లలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో సిరిస్ ని సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. కొలిన్ మున్రో(44), విలియమ్సన్(37), అండర్సన్(44)లతో ఏడు వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనకు దిగిన పాక్.. బాబర్ అజమ్(40), అసీఫ్ అలీ(38), మహ్మద్ హఫీజ్(34)లు రాణించడంతో రెండు బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఇక పాక్ జట్టుకి ఇది వరసగా 8వ టీ 20 విజయం కావడం విశేషం. ఆఫ్ఘనిస్థాన్ వరసగా 11 మ్యాచ్ లు గెలిచి మొదటి స్థానంలో నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో భారత్, పాక్, ఐర్లాండ్ లు ఉన్నాయి. వరసగా సిరిస్ లు గెలిచిన జాబితాలో పాక్ 11 టీ 20 సిరీస్ లు గెలిస్తే.. భారత్ 6 టీ20 సిరీస్ లు మాత్రమే గెలిచింది.

click me!