ఒలింపిక్ బాక్సింగ్ మెడల్ రూల్స్: లవ్లీనా కు మెడల్ ఎలా ఖాయమైందంటే...

By team teluguFirst Published Jul 30, 2021, 1:37 PM IST
Highlights

భారత బాక్సర్ లవ్లీనా సెమిస్ లోకి ప్రవేశించడంతో భారత్ కి కనీసం కాంస్య పతకం ఖాయమైంది. మిగిలిన ఆటల్లో సెమిస్ కి చేరిన తరువాత అక్కడ ఓడితే కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఉంటుంది. కానీ లవ్లీనా సెమిస్ చేరుకోవడంతోనే పతకం ఎలా ఖాయమైందో చూద్దాం

భారత బాక్సర్ లవ్లీనా సెమిస్ లోకి ప్రవేశించడంతో భారత్ కి కనీసం కాంస్య పతకం ఖాయమైంది. మిగిలిన ఆటల్లో సెమిస్ కి చేరిన తరువాత అక్కడ ఓడితే కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఉంటుంది. కానీ లవ్లీనా సెమిస్ చేరుకోవడంతోనే పతకం ఖాయమనడం కొందరికి అంతుబట్టడం లేదు. దీనికి ప్రధాన కారణం బాక్సింగ్ లో రెండు కాంస్య పతకాలను అందించడమే..!

బాక్సింగ్ లో సెమీఫైనల్ కి చేరితే మెడల్ ఖాయం. బాక్సింగ్ లో రెండు కాంస్య పతకాలను ఇస్తారు. రెండు సెమీఫైనల్స్ లో తలపడ్డ నలుగురు బాక్సర్లలో ఇద్దరు ఫైనల్స్ కి అర్హత సాధించి గోల్డ్,సిల్వర్ మెడల్స్ ని దక్కించుకుంటారు. ఇక సెమిస్ లో ఓటమి చెందిన ఇద్దరు బాక్సర్ల మధ్య మరో పోరును పెట్టి కాంస్య పతక విజేతను డిసైడ్ చేయరు. ఇద్దరికీ కాంస్యపతకాలను అందిస్తారు. అందుకే బాక్సింగ్ లో సెమిస్ చేరితే పతకం గ్యారంటీ అనేది.  

మొత్తంగా సెమిస్ లో ఒదిన ఇద్దరు బాక్సర్లకు కాంస్యాన్ని అందిస్తారు. 1948 వరకు సెమిస్ లో ఓడిన ఇద్దరు కాంస్యం కోసం తలపడాల్సి ఉండేది. కానీ... 1952 నుంచి రూల్స్ ను మార్చి ఇద్దరికీ కాంస్యాలను ఇవ్వడం ప్రారంభించారు. జూడో, తైక్వాండో, రెజ్లింగ్ లలో కూడా రెండు కాంస్య పతకాలను అందిస్తారు, కానీ ఇక్కడ ఓడిన సెమి ఫైనలిస్టులు రెపఛాజ్ విన్నర్ తో తలపడాల్సి ఉంటుంది. 

భారత రెజ్లర్లు సుశీల్ కుమార్,యోగేశ్వర్,సాక్షి మాలిక్ అంతా కూడా రెపఛాజ్ మ్యాచుల ద్వారా గెల్చిన వారే. కానీ బాక్సింగ్ లో మాత్రం ఇలాంటి రెపఛాజ్ మ్యాచుల్లేకుండా.... సెమిస్ లో ఓడిన ఇద్దరికీ కాంస్యాల్ని అందిస్తారు. బీజింగ్ లో విజేందర్ సింగ్, లండన్ లో మేరీ కోమ్ సైతం ఇలానే సెమిస్ లో ఓడినప్పటికీ... కాంస్యాల్ని కైవసం చేసుకున్నారు. కాబట్టి సెమిస్ లో రెసుల్త్ ఏదైనా లవ్లీనా కనీసం కాంస్యాన్ని దక్కించుకుంటుంది. 

నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో లవ్లీనా తన లవ్లీ పంచులతో తైపీ బాక్సర్ చెన్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమిస్ లోకి దూసుకెళ్లి భారత్ కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. 

తొలి రౌండ్ నుంచి కూడా ఎక్కడా తడబడకుండా మ్యాచులో పూత్ర్హి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి రెండు రౌండ్లను గెలిచినా లవ్లీనా పై మూఢవ రౌండ్ లో తైపీ బాక్సర్ ఎదురుదాడికి దిగినప్పటికీ.. లవ్లీనా తన ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చి క్వార్టర్స్ లో విజయం సాధించి సెమిస్ లోకి దూసుకెళ్లడం ద్వారా కనీసం కాంస్యాన్ని ఖాయం చేసింది

ఇక మరో బాక్సర్ సిమ్రన్జీత్ కౌర్ థాయ్ బాక్సర్ సూడాపోన్ చేతిలో ఓటమి చెందింది. మహిళల 60 కేజీల రౌండ్ ఆఫ్ 16 లో సిమ్రన్జీత్ ఓటమి చెందింది. తొలి రౌండ్లో వాస్తవానికి తన ప్రత్యర్థిపై తాను పైచేయి సాధించానని సిమ్రన్జీత్ భావించినప్పటికీ... తను  సరిపోను పాయింట్లు స్కోర్ చేసిందని భావించినప్పటికీ... జడ్జిలస్కోరే అందుకు విరుద్ధంగా ఉండడం సిమ్రన్ పై భారీ ప్రభావాన్ని చూపెట్టినట్టుంది. 

click me!