ధోని ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్

Published : Oct 31, 2018, 12:14 PM IST
ధోని ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్

సారాంశం

టీం ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పై మరో సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు

టీం ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పై మరో సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోని ప్రదర్శన అంత గొప్పగా ఏమీలేదంటూ కామెంట్ చేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల టీ20 టీమ్ లను ప్రకటించగా.. అందులో ధోనీకి చోటు ఇవ్వని సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన అభిమానులు సెలక్టర్లపై మండిపడుతున్నారు.  కాగా.. దీనిపై గంగూలీ స్పందించారు.

మంగళవారం ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘టీ20లకు ధోనిని ఎంపికచేయకపోవడం పట్ల నేనేమి ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే అతని ప్రదర్శన అంత గొప్పగా ఏమి లేదు. ధోని 2020 టీ20 వరల్డ్‌కప్‌ వరకు జట్టులో ఉంటాడని అనుకోవట్లేదు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్‌లో ఉన్న రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌ వరకు సెలక్టర్లు ధోనికి అవకామిస్తేనే ఎక్కువగా భావిస్తా. వెస్టిండీస్‌తో చివరి వన్డే అనంతరం ధోని ఆటకు చాలా గ్యాప్‌ వస్తుంది. అతను డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడడు.

మళ్లీ ఆసీస్‌, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌ల్లోనే ఆడుతాడు. అతన్ని రంజీ ట్రోఫీలు ఆడామని సెలక్టర్లు సూచించాలి. దీంతో ఆటతో టచ్‌లో ఉంటాడు. ఇది అతని ఫామ్‌ తిరిగి సాధించడానికి ఉపయోగపడుతోంది. ఎంత పెద్ద ఆటగాడైనా.. రోజు ఆడకపోతే.. ఆటపై ఉన్న పట్టు కోల్పోతాడు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక ఎమ్మెస్కే ప్రసాధ్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ  వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్‌లకు ధోనిని పక్కకు పెడుతు భారత జట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?
Lionel Messi : మెస్సీతో సై అంటే సై.. సీఎం రేవంత్ రెడ్డి రచ్చ.. ఎవరు గెలిచారు?