Neeraj Chopra: లౌసానే డైమండ్ లీగ్‌లో సత్తాచాటిన నీరజ్ చోప్రా..   హేమాహేమీలను వెనక్కి నెట్టి 'పసిడి' పట్టాడు 

By Rajesh KarampooriFirst Published Jul 1, 2023, 4:59 AM IST
Highlights

Neeraj Chopra: ఒలింపియన్ నీరజ్ చోప్రా మరోసారి అదరగొట్టాడు. లాసాన్ డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం నిలిచాడు. బంగారు పతకం సాధించాడు.

Neeraj Chopra: భారత స్టార్  జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తా చాటాడు. లౌసానే డైమండ్ లీగ్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి ద్రుష్టిని తన వైపుకు మళ్లీంచుకున్నాడు. జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరంలో విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. స్వర్ణ పతకం సాధించాడు. 

ఈ లీగ్‌లోని ఐదో రౌండ్‌లో నీరజ్ చోప్రా 87.66 మీటర్లు విసిరి టైటిల్‌ను గెలుచుకున్నాడు. మహామహులు బరిలో ఉన్న ఈ పోటీలో నీరజ్ తొలి రౌండ్‌ను ఫౌల్‌తో ప్రారంభించాడు. ఆపై 83.52 మీటర్లు విసిరాడు, మూడో రౌండ్ లో  85.04 మీటర్లు విసిరాడు. దీని తర్వాత నాల్గవ రౌండ్‌లో మరో ఫౌల్ జరిగింది, కానీ ఐదో  రౌండ్‌లో అతను 87.66 మీటర్లు విసిరాడు. అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ సీజన్‌లో నీరజ్ కు  వరుసగా రెండో విజయం. అంతకుముందు దోహా డైమండ్ లీగ్‌లో 88.67 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు.ఇది నీరజ్‌కి  8వ అంతర్జాతీయ స్వర్ణం. అంతకుముందు ఆసియా క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు, డైమండ్ లీగ్ వంటి టోర్నీల్లో దేశానికి స్వర్ణం సాధించాడు.

 FBK గేమ్స్ నుండి నిష్క్రమణ

శిక్షణ సమయంలో కండరాల ఒత్తిడికి గురైన నీరజ్ గత నెలలో తిరిగి వచ్చాడు, దాని కారణంగా అతను నెదర్లాండ్స్‌లోని FBK గేమ్స్ నుండి వైదొలగవలసి వచ్చింది. నీరజ్ గత సంవత్సరం యూజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి 89.08 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో లాసాన్ డైమండ్ లీగ్‌లో మొదటి స్థానంలో నిలిచాడు.

click me!