వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నీరజ్ చోప్రా... భారత గోల్డెన్ బాయ్‌కి ఇలా ఓటు వేయండి...

By Chinthakindhi Ramu  |  First Published Oct 12, 2023, 6:54 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా... వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నిలిచిన భారత గోల్డెన్ బాయ్.. 


భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా, వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా, ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో స్వర్ణం గెలిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, డైమండ్ లీగ్స్‌లోనూ గోల్డ్ మెడల్స్ సాధించాడు. జావెలిన్ త్రో పురుషుల ర్యాంకింగ్స్‌లో నెం.1గా నిలిచిన నీరజ్ చోప్రా.. మరో 10 మందితో కలిసి వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం పోటీపడబోతున్నాడు.. 

యూఎస్‌ఏ షార్ట్ ఫుట్ అథ్లెట్ రియా క్రౌజర్, స్వీడెన్ పోల్ వాల్ట్ అథ్లెట్ మొండో డుప్లెంటిస్, మారిషస్ 3000మీటర్ల స్టీపెల్‌ఛేజ్ వాకర్ సోఫిన్ ఎ బెక్కలీ, నార్వే 15000 మీటర్ల వాకర్ జాకబ్ ఇంగె‌బ్రిడ్జటన్, కెన్యా మారథన్ రన్నర్ కెల్విన్ కింప్టమ్, కెనడా డెకథ్లాన్ అథ్లెట్ పెర్రీ లాపెజ్, యూఎస్‌ఏ 100 మీటర్ల స్పింటర్ నోవా లెలీస్, స్పెయిన్ రేస్ వాకర్ అల్వారో మార్టిన్, గ్రీస్ లాంగ్ జంపర్ మిల్టిడిస్ టెంటో‌గ్లూ, నార్వే 400 హడ్లర్ అథ్లెట్ కర్‌స్టన్ వార్హోమ్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడబోతున్నారు..

Latest Videos

undefined

ఫైనలిస్టులకు ఓటు వేసేందుకు 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈమెయిల్స్ ద్వారా ఓటు వేయొచ్చు. లేదా వరల్డ్ అథ్లెట్లిక్స్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లోనూ ఓట్లు వేయొచ్చు. ట్విట్టర్‌లో ఎన్ని రీట్వీట్లు వస్తే అన్ని ఓట్లు వేసినట్టు. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో లైక్స్‌ని ఓట్లుగా లెక్కిస్తారు.

ఇలా వచ్చిన ఓట్లను 50 శాతంగా తీసుకుంటారు. అలాగే వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ ఓట్లతో పాటు పబ్లిక్ ఓట్లను కలిపి ఫైనల్ రిజల్ట్ వెలువరిస్తారు. 2020లో భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, 2021లో పురుషుల హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్.. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలిచారు. 

మీ ట్విట్టర్ ఖాతాలో కింది ట్వీట్‌ని రీట్వీట్ వేయడం ద్వారా నీరజ్ చోప్రాకి ఓటు వేయొచ్చు. అలాగే https://www.facebook.com/WorldAthletics ఫేస్ బుక్ పేజీలో నీరజ్ చోప్రా పోస్ట్‌కి లైక్ కొట్టడం ద్వారా కూడా ఓటు వేయొచ్చు. 

Male Athlete of the Year nominee ✨

Retweet to vote for 🇮🇳 in the . pic.twitter.com/z65pP8S4rE

— World Athletics (@WorldAthletics)

 

click me!