ఆసియా కప్: భారీ తేడాతో బంగ్లా చేతిలో శ్రీలంక చిత్తు

By pratap reddyFirst Published Sep 15, 2018, 10:00 PM IST
Highlights

ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న శ్రీలంకపై రహీమ్ సెంచరీ చేయడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. అయితే, బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లు ఆడలేకపోయింది. 49.3 ఓవర్లలో 261 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

దుబాయ్: ఆసియా కప్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకను బంగ్లాదేశ్ భారీ తేడాతో చిత్తు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్ల ముందు శ్రీలంక బ్యాట్స్ మెన్ నిలదొక్కుకోలేకపోయారు. పరుగుల కోసం చెమటోడ్చమే కాకుండా వరుసగా వికెట్లను జారవిడుచుకుంది. బంగ్లాదేశ్ తమ ముందు ఉంచిన 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 124 పరుగులకే చేతులెత్తేసింది. బంగ్లాదేశ్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మొర్తాజా, రెహ్మాన్, మిరాజ్ లు తలో రెండు వికెట్లు తీసుకోగా, హసన్, హొస్సేన్, ముసాద్దెక్ హొస్సేన్ తలో వికెట్ తీసుకున్నారు. 

ఆసియా కప్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక విలవిలలాడింది. శ్రీలంక 63 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పతన దిశగా ప్రయాణం చేసింది.. ఓపెనర్ తరంగా 27 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మెండిస్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తిసారా పెరెరా వికెట్ ను శ్రీలంక కోల్పోయింది. దాంతో 69 పరుగులకే శ్రీలంక 7 వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత లక్మల్, దిల్వురాన్ బంగ్లాదేశ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అయితే, లక్మల్ 20 పరుగులు చేసి 96 పరుగుల జట్టు స్కోరు వద్ద ఎనిమిదో వికెట్ గా వెనుదిరాడు. ఎట్టకేలకు దిల్ రువాన్ అవుటయ్యాడు. అతను 29 పరుగులు చేసి మొసాద్దెక్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో శ్రీలంక 120 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది.

పెరెరా 11 పరుగులు చేశాడు. డీసిల్వ మొర్తాజా బౌలింగులో సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. మాథ్యూస్ 34 బంతుల్లో 16 పరుగులు చేసి రుబెల్ హొస్సెన్ బౌలింగులో అవుటయ్యాడు. శనక 7 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. 

ఆసియా కప్ లో భాగంగా జరిగిన శ్రీలంకపై రహీమ్ సెంచరీ చేయడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. అయితే, బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లు ఆడలేకపోయింది. 49.3 ఓవర్లలో 261 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

కీపర్‌ రహీమ్‌ ( 150 బంతుల్లో 144 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్స్ లు) ధాటిగా ఆడి ఆసియా కప్ తొలి మ్యాచులోనే సెంచరీ నమోదు చేశాడు. మితున్‌ (68 బంతుల్లో 63 పరుగులు, ఐదు ఫోర్లు, రెండు సిక్స్ లు) అర్థ సెంచరీ చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 

మలింగ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ లిటోన్‌దాస్‌ (1) మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడదు. అదే ఓవర్‌ చివరి బంతికి తొలి డౌన్‌లో వచ్చిన షకీబ్‌ అల్‌ హసన్‌ (0) గాయం కారణంగా మైదానాన్ని విడిచి వెళ్లాడు. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహీమ్‌ నెమ్మదిగా ఆడుతూ వికెట్ల వద్ద నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. తర్వాత వేగం పెంచుతూ శ్రీలంక బౌలర్లను చితకబాదాడు. అతనికి మితున్ తోడుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 136 బంతుల్లో 131 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఆ జోడీని మలింగ విడగొట్టాడు. జట్టు స్కోరు 134 వద్ద కుశాల్‌ పెరీరాకు క్యాచ్‌ ఇచ్చి మితున్‌ వెనుదిరిగాడు. రహీమ్‌ చివరి వరకు పోరాడాడు. అయితే 49.3వ బంతికి తిసార పెరీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

మహ్మదుల్లా (1), హుస్సేన్‌ (1), హసన్‌ (15), ముర్తజా (11), రూబెల్‌ హుస్సేన్‌ (2), రెహ్మాన్‌ (10) పరుగులు చేశారు. తమిమ్‌ ఇక్బాల్‌ (2) నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మలింగ 4, డిసిల్వా 2, లక్మల్‌, అపోన్సో, తిసార పెరీరా తలో వికెట్‌ తీశారు.

click me!