MS Dhoni-Ipl: యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వకుండా హాయిగా ఆడుకోండి!

Published : May 21, 2025, 11:06 AM IST
MS Dhoni (Photo: IPL/BCCI)

సారాంశం

యువ ఆటగాళ్లు ఎటువంటి  ఒత్తిడికి లోను కాకుండా ఆడుకోవాలని ఎంఎస్ ధోని సలహ ఇచ్చాడు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ లో రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌ 6 వికెట్లు కోల్పోయినప్పటికీ విజయాన్ని అందుకుంది. ఇంకా 17 బంతులు ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈ మ్యాచ్ ఓడిపోవ‌డంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్ అయిపోయిన తరువాత ఎంఎస్‌ ధోని యువ ఆటగాళ్లకు పలు సలహాలు ఇచ్చాడు. యువ క్రికెటర్ల మీద చాలా అంచనాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరూ కూడా ఒత్తిడికి లోనవ్వద్దు. హాయిగా మీ ఆట మీరు ఆడుకోండి. సీనియర్‌ క్రికెటర్లు, కోచింగ్‌ సిబ్బంది నుంచి చాలా విషయాలను నేర్చుకోవచ్చు.

మీరు 200 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలని అనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ ఉండడం కొంచెం కష్టమైన పనే. అయినా మ్యాచ్‌లో ఏ కీలక దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారికి సొంతం’ అని మ్యాచ్‌ తరువాత ధోని చెప్పుకొచ్చాడు. అలాగే మ్యాచ్‌లో తమ టీమ్‌ ప్రదర్శన గురించి కూడా మాట్లాడాడు. ‘మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యాన్నే ఉంచాం. కానీ మ్యాచ్‌ ఆరంభంలో త్వరత్వరగా వికెట్లు పడిపోవడంతో లోయర్‌, మిడిల్‌ ఆర్డర్‌పై తీవ్రమైన ఒత్తిడే పడింది.

బ్రెవిస్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ప్రదర్శించాడు. అతడు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రన్‌రేట్‌ బాగుంది. కానీ మేం మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో దాన్ని ముందుకు తీసుకురాలేకపోయాం. పేసర్‌ కాంబోజ్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. మనం ఊహించిన దానికంటే అతడి బంతులు వేగంగా తాకాయి. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయడమంటే అంత తేలిక కాదు. కానీ కాంబోజ్‌ బాగా బౌలింగ్‌ చేశాడు’ అని ఎంఎస్‌ ధోనీ పేర్కొన్నాడు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !