ఐపీఎల్ చరిత్రలో ధోనీ సంచలన రికార్డ్

By telugu teamFirst Published May 13, 2019, 10:47 AM IST
Highlights

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ ఘనత ధోనికి దక్కింది. 

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ ఘనత ధోనికి దక్కింది. ఈ ఘనతతో ధోనీ మరో మైలు రాయిని చేరుకున్నారు.

ఐపీఎల్ చరిత్రలో 132 వికెట్లు తీసిన ఘనత ధోనికి దక్కింది. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా... జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ ఈ రికార్డు సాధించాడు. గత రాత్రి చెన్నై.. ఐపీఎల్ ట్రోఫీ కోసం ముంబయితో తలపడిన సంగతి తెలిసిందే.

ధోనీ తొలిసారి దక్షిణాఫ్రికా కీపర్, బ్యాట్స్ మెన్ షార్డుల్ ఠాకూర్ ను ఔట్ చేశాడు. ధోనీ మొత్తం 132 ఔట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ తర్వాతి స్థానంలో కార్తీక్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రాబిన్ ఉతప్ప ఉన్నాడు.

ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. ముంబయి ఇండియన్స్ నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. 

click me!