నన్ను 'ఒసామా' అని పిలిచేవాడు: ఆసీస్ క్రికెటర్ పై మొయిన్ అలీ

Published : Sep 15, 2018, 10:19 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
నన్ను 'ఒసామా' అని పిలిచేవాడు: ఆసీస్ క్రికెటర్ పై మొయిన్ అలీ

సారాంశం

ఆటలో ఆస్ట్రేలియా జట్టు క్రూరమైన తీరుపై ఇంగ్లాండు క్రికెటర్ మొయిన్ అలీ తీవ్రంగా మండిపడ్డాడు. తనను ఒసామా బిన్ లాడెన్ అంటూ ఓ ఆస్ట్రేలియా ఆటగాడు పిలిచేవాడని ఆయన గుర్తు చేసుకున్నాడు. 

ఆటలో ఆస్ట్రేలియా జట్టు క్రూరమైన తీరుపై ఇంగ్లాండు క్రికెటర్ మొయిన్ అలీ తీవ్రంగా మండిపడ్డాడు. తనను ఒసామా బిన్ లాడెన్ అంటూ ఓ ఆస్ట్రేలియా ఆటగాడు పిలిచేవాడని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఈ సంఘటన 2015లో యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా జరిగిందని చెప్పాడు.

ది టైమ్స్‌ ప్రసారం చేస్తున్న మొయిన్‌అలీ ఆత్మకథలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నాడు. కార్డిఫ్‌లో జరిగిన మొదటి యాషెస్‌ టెస్టు సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపాడు. అది తన తొలి యాషెస్‌ టెస్టు. నా ప్రతిభను ప్రదర్శించేందుకు పనికి వచ్చేదని, కానీ, అక్కడ జరిగిన ఒక ఘటన తనపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని అన్నాడు. 

ఒక ఆస్ట్రేలియా ఆటగాడు తనను ఒసామా‌ అంటూ పిలిచేవాడని చెప్పాడు. అయితే మైదానంలో తాను ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెప్పాడు. ఆ ఆటగాడు చేసిన వ్యాఖ్యల గురించి ఒకరిద్దరు ఆసీస్‌ ఆటగాళ్లకు, ఆ జట్టు కోచ్‌ డారెన్‌ లీమన్‌కు చెప్పానని అన్నాడు. 

అప్పుడు కోచ్‌ డారెన్‌ ఆ క్రీడాకారుడిని పిలిచి "మొయిన్‌ అలీని ఒసామా అని పిలిచావా" అని ప్రశ్నించినట్లు తెలిపాడు. కానీ, ఆ క్రికెటర్ "నేను అలా పిలవలేదు. కేవలం పార్ట్‌టైమర్‌ అని మాత్రమే అన్నాను" అని అబద్ధం చెప్పాడని వివరించాడు.

ఒసామా, పార్ట్‌ టైమర్‌ అనే పదాలకు తనకు తేడా తెలుసునని, మరీ అంత పిచ్చివాడిని కాదని మొయిన్ అలీ అన్నాడు. తాను సరిగానే విన్నానని తెలిపాడు. అందుకే మ్యాచ్‌ మొత్తం తాను కోపంగానే ఉండాల్సి వచ్చిందని అలీ అన్నాడు.

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?