కుశాల్ పెరెరా వన్ సైడ్ బ్యాటింగ్: సఫారీలపై శ్రీలంక ఉత్కంఠ విజయం

By telugu teamFirst Published Feb 17, 2019, 8:49 AM IST
Highlights

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఒక్క వికెట్ తేడాతో శ్రీలంక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 304 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాకు అతను కొరకరాని కొయ్యగా మారాడు. 

దర్బన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో కుశాల్ పెరేరా ఒక్కడే అయి శ్రీలంకకు విజయం సాధించి పెట్టాడు. ఒకే ఒక్క వికెట్ చేతిలో ఉన్న సమయంలో పెరేరా సమయస్ఫూర్తిగా, అద్భుతంగా ఆడడంతో శ్రీలంక విజయం సాధించింది. 

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఒక్క వికెట్ తేడాతో శ్రీలంక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 304 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాకు అతను కొరకరాని కొయ్యగా మారాడు. 

బౌలర్ల సహనానికి పెరెరా పరీక్ష పెట్టాడు. కుశాల్ పెరీరా (153) చివరి వికెట్‌కు ఫెర్నాండో(6)తో కలిసి ఏకంగా 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫెర్నాండోను క్రీజులో పెట్టుకుని జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు. 

కుశాల్ పెరీరా 86 పరుగుల వద్ద ఉన్నప్పుడు చివరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన ఫెర్నాండోకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా పెరీరా ఆడాడు. అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ఫెర్నాండో కూడా చాలా జాగ్రత్తగా ఆడాడు. దాదాపు 15 ఓవర్లు క్రీజులో ఉన్న ఫెర్నాండో 27 బంతులు మాత్రమే ఎదుర్కొని 6 పరుగులు చేశాడు. అతని సహకారంతో పెరేరా చెలరేగిపోయాడు. 200 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 153 పరుగులు చేశాడు. జట్టును గెలిపించిన పెరేరాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో 235 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 259 పరుగులు చేయగా, శ్రీలంక తొలి ఇన్నింగ్సులో 191 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్సులో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.

click me!