Koneru Humpy: డీ గుకేష్ ఇటీవలి చెస్ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ 2024 FIDE మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలవడంతో 2024 భారత చెస్ కు గొప్ప సంవత్సరంగా గొప్ప క్షణాలను అందించింది.
Koneru Humpy Wins World Rapid Championship 2024: వరల్డ్ ర్యాపిడ్ చెెస్ ఛాంపియన్‌షిప్ 2024 విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్‌గా ఆమె ఘనత సాధించింది. డీ గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తర్వాత.. ఇప్పుడు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ 2024 FIDE ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలవడం భారత చెస్ రంగంలో 2024 గొప్ప క్షణాలను అందించిన సంవత్సరంగా నిలిచింది.
న్యూయార్క్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ గా నిలిచాడు. చైనాకు చెందిన జు వెన్జున్ తర్వాత మహిళల విభాగంలో రెండు విజేతగా నిలిచిన రెండో చెస్ క్రీడాకారిణిగా కోనేరు హంపి ఘనత సాధించారు. 2024 FIDE ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ షిప్ చివరి రౌండ్ లో ఐరీన్ సుకందర్ ను బ్లాక్ పీస్ తో ఓడించి హంపి టైటిల్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ చెస్ ర్యాపిడ్ ఛాంపియన్ షిప్ లో ఆకట్టుకునే ప్రదర్శనతో 11 పాయింట్లకు గాను 8.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కోనేరు హంపి నిలిచారు. 2019లో జార్జియాలో కూడా ఇదే తరహా విజయాన్ని అందుకున్నారు. ఈ ఫార్మాట్లో ఆమె రెండో టైటిల్ కావడం విశేషం.
Congratulations to the winners of the 2024 FIDE Women's World Championship! 👏
🥇Humpy Koneru
🥈Ju Wenjun
🥉Kateryna Lagno pic.twitter.com/TJ77lzIp7O
2012లో మాస్కోలో కాంస్య పతకం సాధించడం ద్వారా హంపి తొలిసారి చెస్ లో తన సత్తా చాటింది. అయితే 2019లో జార్జియాలోని బటుమిలో చైనా క్రీడాకారిణి లీ టింగ్జీని ఓడించి సంచలన గేమ్ ప్లే ప్రదర్శించి టైటిల్ గెలుచుకుంది. భారత గ్రాండ్ మాస్టర్ 2023 ఎడిషన్ లో రజత పతకం సాధించింది. ర్యాపిడ్ చెస్ లో సాధించిన విజయాలతో పాటు, ఇతర ఫార్మాట్లలో కూడా కోనేరు హంపి ఆకట్టుకుంది. 2022 మహిళల ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం, 2024లో మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
రెండో సారి వరల్డ్ ర్యాపిడ్ చెెస్ ఛాంపియన్‌షిప్ ను గెలుచేకోవడంపై గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సంతోషం వ్యక్తం చేశారు. ''ఇది నా రెండవ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ కాబట్టి నేను చాలా సంతోషంగా.. ఉత్సాహంగా ఉన్నాను. నేను 2019లో కూడా గెలిచాను...నా కెరీర్‌లో ఇది రెండో టైటిల్. నా కెరీర్ లో నేను దిగువన ఉన్నప్పుడల్లా, నేను డ్రాప్ అవుతున్నానని అనుకుంటూ.. మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అది నాకు మరింత పోటీ చేయడానికి ప్రేరణనిస్తుంది'' అని హంపీ తెలిపారు.
అలాగే, దేశంలో ప్రజలు మేల్కోడానికి కాస్త సమయం పట్టవచ్చు కానీ, నా కుటుంబం ఇప్పుడు నా విజయాన్ని చూస్తోంది. నా తల్లిదండ్రులకు వారి అద్భుతమైన మద్దతుకు, నా భర్తకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. పెళ్లయి, పిల్లాడితో ఇండియాలో ప్రొఫెషనల్‌గా మారడం అంత సులభం కాదు. కానీ మా కుటుంబం నాకు చాలా మద్దతు ఇచ్చింది. నేను ప్రయాణించేటప్పుడు నా తల్లిదండ్రులు నా కుమార్తెను చూసుకున్నారు. ఇవన్నీ సాధించడానికి నాకు ఎంతగానో మద్దతును అందించారు'' అని పేర్కొన్నారు.
2024 FIDE ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ ను రెండవసారి గెలిచినందుకు తెలుగు తేజం గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమె తన అద్భుతమైన ప్రయాణంతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉందని కొనియాడారు. "ఈ విజయం మరింత చారిత్రాత్మకమైనది ఎందుకంటే ఇది ఆమె రెండవ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ టైటిల్. ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించిన ఏకైక భారతీయురాలు" అని అభినందనలు తెలిపారు. అలాగే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హంపీకి అభినందనలు తెలిపారు.
Congratulations to on winning the 2024 FIDE Women’s World Rapid Championship! Her grit and brilliance continues to inspire millions.
This victory is even more historic because it is her second world rapid championship title, thereby making her the only Indian to… https://t.co/MVxUcZimCc pic.twitter.com/nndIak2OvI
Heartiest congratulations to Koneru Humpy for winning the 2024 Women’s World Rapid Chess Championship—her second world title! Your brilliance and perseverance inspire not just Andhra Pradesh but the entire nation. A true queen of chess! 🏆
-
… pic.twitter.com/6plOURkiuA
What a proud moment for India! Congratulations to Koneru Humpy on winning the FIDE Women’s World Rapid Chess Championship 2024. Her incredible triumph caps off a phenomenal year for Indian chess! pic.twitter.com/DB4KqEMUMO
— N Chandrababu Naidu (@ncbn)
కోనేరు హంపీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ. ఆమె కోనేరు అశోక్, లతా దంపతులకు 31 మార్చి 1987 లో జన్మించారు. భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ గా ఎదిగారు. ఆమె 2019లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ లో విజేతగా నిలిచారు. ఇప్పుడు మరోసారి 2024లో విజేతగా నిలిచారు. 2002లో అంటే ఆమె 15 ఏళ్ల 1 నెల 27 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన అతి పిన్న వయస్కురాలుగా కూడా ఘనత సాధించారు. ఒలింపియాడ్ , ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతక విజేతగా నిలిచారు. ఆమె మొదటి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ గా కూడా చరిత్రకెక్కారు.
ర్యాపిడ్ వరల్డ్స్‌లో, ఆమె మాస్కోలో జరిగిన 2012 ఎడిషన్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని, 2023లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. కోనేరు హంపి తండ్రి కోనేరు అశోక్ ఆమెకు కోచ్‌గా పనిచేశారు. ఆయన దగ్గరే ఆమె నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాని కోనేరు హంపి తెలిపారు.