చిన్ననాటి స్నేహితురాలితో ఐపిఎల్ స్టార్ బ్యాట్ మెన్ నితీష్ రాణా నిశ్చితార్థం

First Published 12, Jun 2018, 12:33 PM IST
Highlights

నితీష్ రాణా-సాచి మార్వాలకు శుభాకాంక్షలు తెలిపిన కోల్‌కతా నైట్‌రైడర్స్  

ఇటీవల ఇపిఎల్-11 సీజన్ లో తన అద్బుత బ్యాటింగ్ తో  అదరగొట్టిన నితీష్ రాణా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మార్వా తో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ శుభకార్యానికి అతడి సన్నిహితులతో పాటు కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు.      

ఆయన ఈ  ఐపిఎల్ సీజన్ లో కోల్ కతా నైడ్ రైడర్స్ టీం తరపున ఆడాడు. ఇతన్ని కోల్ కతా నైట్ రైడర్స్ టీం 3.4 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది. దీనికి న్యాయం చేస్తూ రాణా అద్భుతమైన బ్యాటింగ్ తో నైట్ రైడర్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.  అతడు ఈ ఐపిఎల్ సీజన్ లో 15 మ్యాచుల్లో 304 పరుగులు చేసి నైట్ రైడర్స్ ని సెమీస్ వరకు చేర్చడంతో కీలకంగా వ్యవహరించాడు.

ఈ డిల్లీ యువ క్రికెటర్ కి కోల్‌కతా నైట్‌రైడర్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందించింది. కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. త్వరలోనే  పెళ్లి వేడుక జరగనుందని, ఆ వివరాలను అతి త్వరలో వెల్లడించనున్నట్లు నితీష్ తెలిపాడు.

ఈ ఐపిఎల్ సీజన్ లో రాణించిన క్రికెటకర్లు సందీప్ శర్మ, మయాంక్ అగర్వాల్‌ లు కూడా తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నారు. ఇపుడు వీరి బాటలోనే నితీష్ రానా నడుస్తూ పెళ్లికి సిద్దమయ్యాడు.  

 

 

Last Updated 12, Jun 2018, 12:33 PM IST