ఇంత పెద్ద దేశంలో వారిద్దరేనా?

By Rekulapally Saichand  |  First Published Dec 11, 2019, 5:09 PM IST

బ్యాడ్మింటన్ కొచ్  పుల్లెల గోపిచంద్‌ను మరోసారి  టార్గెట్ చేశారు గుత్తా జ్యాల   డబుల్స్ ఆటగాళ్లకు తగిన ప్రాముఖ్యత  ఇవ్వకపోవడంపై  గోపిచంద్
స్పందించాలని కోరారు. 


బ్యాడ్మింటన్ కొచ్  పుల్లెల గోపిచంద్‌ను మరోసారి  టార్గెట్ చేశారు గుత్తా జ్యాల   డబుల్స్ ఆటగాళ్లకు తగిన ప్రాముఖ్యత  ఇవ్వకపోవడంపై  గోపిచంద్ స్పందించాలని కోరారు.   ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’  పేరుతో గుత్తా సొంత అకాడమిని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 


సుదీర్ఘ చరిత్ర కలిగిన  భారత బ్యాడ్మింటన్‌ క్రీడాలో ఓ వ్యక్తి ప్రమోయం మాత్రమే ఉందని అతని నిర్ణయాలు శిరోధారంగా మారయని గోపిచంద్‌ను ఉదేశిస్తూ పరోక్ష ఆరోపణలు చేశారు.  దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదంటూ  మండిపడ్డారు. ఆయన ఓ చీఫ్ కోచ్, ఓ చీఫ్ సెలెక్టర్, అంతేకాకుండా జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి, ఖేలో ఇండియాలో లాంటి విభాగాలలో ఆయన ముఖ్యుడు. అలాగే   సొంత అకాడమీ కూడా ఉందంటూ విమర్శించారు. 

Latest Videos

undefined


వారు కేవలం మీడియా ద్వారా మాత్రమే ప్రచారం పోందారని,నిజంగా బ్యాడ్మింటన్ కోసం కృషి చేసిన ఆరిఫ్ సర్ లాంటి కోచ్‌ల గురించి ఆట కృషి చేసిన  తన లాంటి వారి గురించి  ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత బ్యాడ్మింటన్‌లో  జరుగుతున్న అన్యాయాల  గురించి ఆటగాళ్ళు ఎవరు నోరు మెదపడం లేదు. కారణం జాతీయ జట్టులో ఎంపిక చేయబడరనే భయం వారిలో ఉందన్నారు. 


"ఇంత పెద్ద దేశం నుంచి  సైనా, సింధులు మాత్రమే వచ్చారు.  చాలా మంది క్రీడాకారులు రావల్సిన అవసరం  ఉంది. నేను త్వరలో ప్రారంభించేఅకాడమీ  నుంచి ఈ దేశానికి ఛాంపియన్లను అందించడమే నా లక్ష్యం. సొంతగానే అకాడమీని నిర్మించా.  ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే  ఎక్కువ పతకాలు గెలవగాలం" అని జ్వాల తెలిపింది.

click me!