గంభీర్ ని పక్కనపెట్టిన ఫ్రాంఛైజీలు.. ఫ్యాన్స్ ఫైర్

By ramya neerukondaFirst Published Nov 16, 2018, 3:29 PM IST
Highlights

ఐపీఎల్-2019 కోసం తమ జట్టులోని ఆటగాళ్ల ప్రక్షాళనను మొదలెట్టాయి. అవసరం లేని ఆటగాళ్లను వదులుకుంటూ భారాన్ని తగ్గించుకుంటున్నాయి.


ఐపీఎల్ ఫీవర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. ఐపీఎల్ సీజన్ మొదలైందంటే చాలు.. క్రికెట్ ప్రియులు టీవీలు వదిలపెట్టరు.  ఇదిలా ఉంటే ఫ్రాంఛైజీలు కూడా టీం కోసం కసరత్తులు మొదలుపెట్టాయి. ఐపీఎల్-2019 కోసం తమ జట్టులోని ఆటగాళ్ల ప్రక్షాళనను మొదలెట్టాయి. అవసరం లేని ఆటగాళ్లను వదులుకుంటూ భారాన్ని తగ్గించుకుంటున్నాయి.

ముఖ్యంగా సీనియర్లపై వేటు వేసేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్... గౌతమ్ గంభీర్ ని వదులుకుంది. గంభీర్‌తో సహా 10 మంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు మహ్మద్‌ షమీ, సయాన్‌ గోష్‌, గురక్రిత్‌ సింగ్‌, నమాన్‌ ఓజా ఉండగా.. విదేశీ ఆటగాళ్లలో జాసన్‌ రాయ్‌, జూనియర్‌ డాలా, లియామ్‌ ప్లంకెట్‌, డానియల్‌ క్రిస్టియన్‌, గ్లేన్‌ మాక్స్‌వెల్‌లు ఉన్నారు. పంత్‌, అయ్యర్‌, పృథ్వీషాతో సహా 14 మందిని మాత్రమే ఢిల్లీ అట్టిపెట్టుకుంది.

అయితే.. గౌతమ్ గంభీర్ ని దూరం పెట్టడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్‌గా కోల్‌కతాకు రెండు సార్లు టైటిల్‌ అందించిన గంభీర్‌.. ఢిల్లీ కోసం వస్తే వదులుకుంటారా? అని విమర్శిస్తున్నారు.  గంభీర్‌ లేని ఢిల్లీ ఐపీఎల్ గెలిచే అవకాశమే లేదని జోస్యం చెబుతూ.. సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

click me!