ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా ? (వీడియో)

Published : May 25, 2018, 01:33 PM IST
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా ? (వీడియో)

సారాంశం

 ఇప్పుడీ న్యూస్ సెన్సేషన్ గా మారింది 

ఇప్పుడీ న్యూస్ సెన్సేషన్ గా మారింది. హాట్‌ స్టార్‌ రూపొందించిన ఓ వీడియో ఇప్పుడీ అనుమానానికి కారణమైంది. ఆ వీడియో సారంశం ఏంటంటే.. తాజా సీజన్‌ లో ఫైనల్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌- కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఢీకొట్టబోతున్నాయట. క్వాలిఫయర్‌-1లో విజయం సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు మాత్రమే ఇప్పటి వరకు ఫైనల్‌ చేరుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుని.. వాంఖేడే స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. అలాంటపుడు క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరగకుండానే హాట్‌స్టార్‌ కోల్‌కతా జట్టు  ఫైనల్‌ చేరినట్లు వీడియో రూపొందించడంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదంతా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అని విపరీతంగా కామెంట్లు పెడుతూ విమర్శలు చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్
IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్