శ్రీలంకపై భారత్ ఘన విజయం

First Published Jun 7, 2018, 3:40 PM IST
Highlights

టీ20 ఆసియాకప్ లో మహిళా జట్టు ముందజ

ఆసియా కప్‌లో బారత మహిళా జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. ఇవాళ  శ్రీలంక తో జరిగిన  టీ20 మ్యాచ్‌ లో భారత జట్టు మరో విజయాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించి ఆ సీరీస్ లో మూడో విజయాన్ని కైవసం చేసుకుంది.  

కౌలాలంపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్‌ గెలిచిన లంక జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ భారత బౌలర్లు విజృంభించారు. దీంతో  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  లంక జట్టు 107 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు ఏక్తా బిస్త్‌కు రెండు, జులన్‌ గోస్వామి, పాటిల్‌, పూనమ్‌ యాదవ్‌కు తలో వికెట్‌ దక్కింది.

108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ బ్యాట్ ఉమెన్స్ సమిష్టిగా రాణించి విజయం లక్ష్యాన్ని అలవోకగా చేదించారు.  108 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.5 ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి  ఛేదించింది.  మిథాలీ రాజ్‌(23), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(24), వేదా కృష్ణమూర్తి(29 నాటౌట్‌), అనుజా పటేల్‌( 19 నాటౌట్‌) పరుగులు సాధించి జట్టు విజయంలో తలో చేయి వేశారు.


 

click me!