కోహ్లీ నాతో విబేధించాడు: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే

By Arun Kumar PFirst Published Jan 23, 2019, 5:02 PM IST
Highlights

తనకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య జట్టు ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయంటూ భారత క్రికెట్ సెలక్షన్ కమీటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో సెలెక్షన్ కమీటి సభ్యులు, కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యతిరేకించారని ప్రసాద్ వెల్లడించారు. కానీ తర్వాత వారే పొరపాటు చేసినట్లు ఒప్పుకున్నారని ఎమ్మెస్కే తెలిపారు. 
 
గుంటూరు జిల్లా చేబ్రోలులో సెయింట్‌ మేరీస్‌ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన క్రికెట్‌ గ్రౌండ్‌‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల విజయవంతంగా పూర్తయిన ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడారు. ఈ పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ప్రసాద్ వెల్లడించారు. 

ఆస్ట్రేలియా పర్యటనలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని తాను భావించానని...కానీ మిగతా బోర్డు సభ్యులు, కెప్టెన్ కోహ్లీ అందుకు వ్యతిరేకించారని ఆయన తెలిపారు. ప్రపంచ కప్ కు ముందు జట్టులో ఇలాంటి ప్రయోగాలు చేయడం  మంచిది కాదని...సీనియర్లనే ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేయడంతో తాను తలొగ్గాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా కోహ్లీ సీనియర్ల ఎంపిక కోసం పట్టుబట్టాడని ప్రసాద్ పేర్కొన్నారు. 

యువ క్రికెటర్లను కాదని జట్టులో స్ధానం కల్పించిన ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శ కనబర్చారన్నారు. దీంతో జరిగిన పొరపాటును కోహ్లీ అంగీకరించాడని తెలిపారు. ఈ పర్యటనలో తాను అనుకున్నట్లే యువ క్రికెటర్లు హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ చక్కగా రాణించారని ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తుచేశారు. 

click me!